Vijay Deverakonda : VD12 షూటింగ్ లో విజయ్ దేవరకొండకు గాయం.. అయినా షూట్ కంటిన్యూ చేస్తున్న విజయ్..
VD12 సినిమా షూట్ సమయంలో తాజాగా విజయ్ దేవరకొండకు గాయం అయిందని సమాచారం.
- By News Desk Published Date - 08:02 AM, Tue - 5 November 24

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ హిట్ చూసి చాలా ఏళ్ళు అవుతుంది. ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు ఏదో పర్వాలేదనిపించాయి. కానీ ప్రస్తుతం మూడు పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టాడు. వాటిల్లో గౌతమ్ తిన్ననూరి VD12 సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాపైనే విజయ్ ఆశలు పెట్టుకున్నాడు. సినిమా కూడా అదిరిపోతుంది అని టాలీవుడ్ టాక్.
ఇటీవల ఈ సినిమా శ్రీలంకలో షూట్ జరుపుకోగా ప్రస్తుతం కేరళలో షూట్ జరుపుకుంటుంది. అయితే VD12 సినిమా షూట్ సమయంలో తాజాగా విజయ్ దేవరకొండకు గాయం అయిందని సమాచారం. ఓ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు విజయ్ దేవరకొండ భుజానికి గాయం అయిందట. దీంతో షూట్ ఆపుదామనుకున్నారు. కానీ విజయ్ ప్రాథమిక చికిత్స తీసుకొని రోజూ ఫిజియోథెరపీ చేయించుకుంటూనే షూటింగ్ లో పాల్గొంటున్నాడట.
దీంతో విజయ్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటూనే విజయ్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే సమ్మర్ లో రిలీజవుతుందని సమాచారం. మరి ఈ సినిమాతోనైనా హిట్ కొట్టి విజయ్ ట్రాక్ లో పడతాడేమో చూడాలి.
Also Read : Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్.. ఎప్పుడు.. ఎక్కడ..?