Vijay Deverakonda : అమెరికాలో విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదుగా..!
అమెరికాలో విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదుగా. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్..
- Author : News Desk
Date : 10-06-2024 - 3:46 IST
Published By : Hashtagu Telugu Desk
Vijay Deverakonda : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. విజయాపజయాలతో సంబంధం లేకుండా తన ఇమేజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా యూత్‌లో, అమ్మాయిల్లో మంచి ఫేమ్ ని సంపాదించుకుంటున్నారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా విజయ్ మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంటున్నారు. బాలీవుడ్ లో అయితే సెలబ్రిటీస్ అభిమానాన్ని అందుకుంటున్నారు.
ఇక తాజాగా ఈ హీరో అమెరికా వెకేషన్ కి వెళ్లారు. తన తల్లిదండ్రులు, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి విజయ్ రీసెంట్ గా అమెరికా వెళ్లారు. ఇక అక్కడ వెకేషన్ ని ఎంజాయ్ చేయడమే కాకుండా.. ఒక ఫ్యాన్స్ మీట్ పెట్టి అక్కడ ఉన్న తెలుగు ఆడియన్స్ ని కలుసుకున్నారు. విజయ్ కలుసుకుండేందుకు అమెరికాలో ఉన్న ఆడియన్స్ భారీగా తరలి వచ్చారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ రౌడీ బాయ్ కోసం తరలి వచ్చారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
#VijayDeverakonda At ATA – USA.
Excellent reception by the USA Telugu people-Women forum ❤️ @TheDeverakonda pic.twitter.com/SvxgdwxWVL
— Suresh PRO (@SureshPRO_) June 10, 2024
Whether it’s India or United States the craze remains same for @TheDeverakonda🔥❤️#VijayDeverakonda pic.twitter.com/pEjPrdg7kn
— Andhra VD Fans (@AndhraVDFans) June 10, 2024
కాగా విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందుతుంది. విజయ్ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తున్నారు. విజయ్ కెరీర్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో సిద్ధం చేస్తున్నారు.
ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీలని ఎంపిక చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆమె తప్పుకున్నట్లు సమాచారం. ఆమె ప్లేస్ లోకి ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మూవీ టీం మాత్రం.. ఇప్పటివరకు దీనిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.