Vijay Devarakonda : ఏంటి ఆ సినిమా సగమే పూర్తైందా.. మరి రిలీజ్ డేట్ ఇచ్చేశారు.. అంత తొందర ఎందుకో..?
Vijay Devarakonda దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ కలిసి జంటగా నటిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజై
- By Ramesh Published Date - 04:23 PM, Fri - 3 November 23

Vijay Devarakonda దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ కలిసి జంటగా నటిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజై ఇంప్రెస్ చేసింది. సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ఒక న్యూస్ రౌడీ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఈ సినిమా ఇప్పటివరకు సగం మాత్రమే షూటింగ్ పూర్తి చేశారట. పరశురాం డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా 50 శాతం మాత్రమే పూర్తి కాగా సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.
మరి సంక్రాంతి (Sankranthi) రిలీజ్ చేయాలని అనుకున్న వారు ఇంకా సగం పైగా షూటింగ్ పెండింగ్ ఉండటం ఏంటని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. త్వరలోనే బ్యాంకాక్ లో ఒక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్ లో సినిమా దాదాపు పూర్తవుతుందని తెలుతుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కూల్ అండ్ కంపోసెడ్ గా కనిపిస్తున్నారు.
ఫ్యామిలీ స్టార్ (Family Star) టీజర్ తో సర్ ప్రైజ్ చేయగా సినిమా కూడా విజయ్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ అందిస్తుందని చెబుతున్నారు. గీతా గోవిందం (Geetha Govindam)తో హిట్ అందుకున్న పరశురాం విజయ్ దేవరకొండ మరోసారి ఆ హిట్ మ్యాజిక్ రిపీట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమా విషయంలో దిల్ రాజు (Dil Raju) ప్లానింగ్ ఏంటో కానీ సినిమా సంక్రాంతికి రిలీజ్ అనుకుని ఇంకా షూటింగ్ పూర్తి అవ్వకపోవడంపై విజయ్ ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తిగా ఉన్నారు.
Also Read : Rakul Preet Singh : అలాంటి రాత్రులు గడిపా.. ఏది అంత ఈజీగా రాదంటున్న రకుల్..!
We’re now on WhatsApp : Click to Join