HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Vijay Devarakonda Emotional Tweet On Kushi Talk

Kushi Talk : ఖుషి సక్సెస్ టాక్ ఫై విజయ్ దేవరకొండ ఎమోషనల్ ట్వీట్

నా విజయం కోసం నన్ను అభిమానించే వారంతా 5 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు. నేను మంచి సినిమా చేస్తానని ఓపిగ్గా ఎదురుచూశారు

  • By Sudheer Published Date - 03:56 PM, Fri - 1 September 23
  • daily-hunt
vijay devarakonda emotional tweet on Kushi Talk
vijay devarakonda emotional tweet on Kushi Talk

అర్జున్ రెడ్డి , గీత గోవిందం వంటి లవర్ , ఫ్యామిలీ స్టోరీస్ తో యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ..ఆ రెండు సినిమాలతోనే స్టార్ హీరో గుర్తింపు సాదించుకున్నాడు. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్స్ మాత్రం కొట్టలేకపోయాడు. పూరి తో లైగర్ అంటూ పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ..ఆ మూవీ భారీ డిజాస్టర్ అయ్యి..విజయ్ కి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది. దీంతో ప్రయోగాల జోలికి వెళ్లకుండా తనకు కలిసొచ్చిన ప్రేమ కథల వైపు దృష్టి పెట్టాడు. మజిలీ తో సూపర్ హిట్ కొట్టిన శివ నిర్వాణ చెప్పిన ‘ఖుషి’ కథకు ఓకే చెప్పి..సెట్స్ పైకి తీసుకొచ్చాడు.

యూత్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) – సమంత (Samantha ) జంటగా మజిలీ ఫేమ్ శివ నిర్వాణ (‎Shiva Nirvana) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ఖుషి (Kushi). మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించిన ఈ మూవీ లో జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈరోజు ( సెప్టెంబర్ 1వ తేదీన ) తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాలోని సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలువడం… ఒకదానిని మించి మరోటి హిట్ అవ్వడం.. పాటలతోనే కాకుండా చిత్ర ట్రైలర్ , టీజర్ , స్టిల్స్ , ప్రమోషన్ కార్యక్రమాలు ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి నింపడం తో సినిమాను చూసేందుకు అభిమానులు , సినీ లవర్స్ పోటీ పడ్డారు. అర్ధరాత్రి నుండే సినిమా షోస్ పడడం తో సినిమా ను చూసిన అభిమానులు , సినీ లవర్స్ సినిమా సూపర్ గా ఉందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఖుషి తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడని అంటున్నారు. సామ్ – విజయ్ జోడి బాగుందని , ఇద్దరి కెమిస్ట్రీ చాల బాగుందని చెపుతున్నారు. మరోపక్క సినీ ప్రముఖులు సైతం సినిమా కు పాజిటివ్ బజ్ వినిపిస్తుండడం తో విజయ్ ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఖుషి సక్సెస్ ను పంచుకున్నారు.

‘‘నా విజయం కోసం నన్ను అభిమానించే వారంతా 5 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు. నేను మంచి సినిమా చేస్తానని ఓపిగ్గా ఎదురుచూశారు. ఈరోజు ‘ఖుషి’తో చేసి చూపించా. ఉదయం మేల్కొవడమే శుభవార్త విన్నాను. నా చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంతో నన్ను నిద్రలేపారు. వందల మెేసజ్‌లతో నా ఫోన్‌ ఇన్‌బాక్స్‌ నిండిపోయింది. వరుసగా ఫోన్‌లు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేకపోతున్నా. మీ కుటుంబంతో వెళ్లి సినిమాను ఎంజాయ్‌ చేయండి. మీరంతా ‘ఖుషి’ని ఆదరిస్తారని నాకు తెలుసు. లవ్యూ ఆల్‌’’ అని రాసుకొచ్చాడు. దీనికి ఎమోషనల్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా విజయ్‌ దేవరకొండ జోడించారు.

🥹

You all waited for 5 years, with me. Patiently waiting for me to do my thing! We did it. Today!! 🙂

Waking up to this happiness from all around and my phone to hundreds of messages.

I cannot help but tear up with emotions. I love you all ❤️

Go and enjoyyyyy this one with…

— Vijay Deverakonda (@TheDeverakonda) September 1, 2023

ఇక సినిమా కథ ఏంటి..? ప్లస్ ..మైనస్ ఏంటి..మిగతా విషయాలు ఏంటి అనేది చూస్తే.. !

విప్లవ్ (విజయ్ దేవరకొండ)..BSNL లో జాబ్ చేస్తుంటాడు..ఈ క్రమంలో కాశ్మీర్ కు ప్రమోషన్ చేయించుకుంటాడు. అక్కడ బురఖా‌లో ఉన్న బేగం (సమంత)ని చూసి ఇష్టపడతాడు. కాకపోతే తాను పాక్ నుండి వచ్చానని బేగం చెప్పినప్పటికీ..నేను కూడా పాక్ కు వస్తా అంటూ తన ప్రేమను వ్యక్తం చేస్తూ వస్తుంటాడు. విప్లవ్ నిజమైన ప్రేమకు ఫిదా అవుతుంది. కానీ వీరిద్దరి పెళ్ళికి మాత్రం పెద్దలు అడ్డు చెపుతారు. విప్లవ్, బేగం పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండలేరని.. వారికి గండం ఉందని , పెళ్లైనా వారికి పిల్లలు పుట్టరని.. కాపురంలో సమస్యలు వస్తాయని పెద్దలు చెపుతారు. కానీ పెద్దల మాటలు పట్టించుకోకుండా..మీము పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇలాగే హ్యాపీగా ఉంటామని సవాల్ చేసి..విప్లవ్ బేగం ను పెళ్లి చేసుకుంటాడు. ఆలా పెళ్లి చేసుకున్న వీరిద్దరూ..ఆ తర్వాత ఎలాంటి గొడవలు పడ్డారు..? విప్లవ్, బేగంల కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది..? చివరికి విప్లవ్-బేగం కథ ఎలా సుఖాంతం అవుతుంది..? అసలు వీరి మధ్య గొడవలు ఎందుకు వస్తాయి..? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* ఫస్ట్ హాఫ్

* విజయ్ – సామ్ జోడి

* సాంగ్స్

* క్లయిమాక్స్

మైనస్ :

* తెలిసిన కథే

* సెకండ్ హాఫ్ లో బోరింగ్ సన్నివేశాలు

* విసుగుతెప్పించిన బ్రహ్మి కామెడీ

నటీనటుల తీరు :

విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ కి ఏ పాత్ర ఇచ్చిన దానికి 100 % న్యాయం చేస్తాడు. ఈ సినిమాలో కూడా అలాగే చేసాడు. ముఖ్యంగా కామెడీ , ఎమోషన్ , రొమాంటిక్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. సమంత – విజయ్ జోడి కట్టిపడేసింది. సామ్ ప్రేమకోసం విజయ్ పడే కష్టాలు యూత్ కు కిక్ ఇస్తాయి.

సమంత కూడా చాల అందంగా కనిపించింది. మొదట ముస్లిం యువతిగా..ఆ తర్వాత హిందూ భార్య గా చాల చక్కగా ఒదిగిపోయింది. చాల సన్నివేశాల్లో విజయ్ పోటీ ఇస్తూ నటించింది. ఖుషి టైటిల్ సమంత, విజయ్ దేవరకొండ పెయిర్ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. సంఘర్షణని నిజంగా అనుభవిస్తున్నట్టుగా జీవించేశారు ఇద్దరూ.

మురళీశర్మ, సచిన్ ఖేడేకర్‌లు సినిమాకు మూల స్తంభాలుగా నిలిచారు. మురళీశర్మ అయితే.. ప్రవచన కర్తగా ఆ పాత్రలో ఒదిగిపోయారు. సైన్స్ గొప్పదా? శాస్త్రం గొప్పదా అంటూ వీరి మధ్య నడిచే రసవత్తర పోరు.. భిన్న వాదనలకు తావిచ్చినా.. ఆయా పాత్రల్ని మాత్రం పర్ఫెక్ట్‌గా డీల్ చేసి పూర్తి న్యాయం చేశారు. మరో ఇంపార్టెంట్ రోల్‌లో రోహిణి జీవించేసింది. తన కూతురి సెంటిమెంట్ సీన్‌తో కళ్లు చెమ్మగిల్లేట్టు చేసింది. ఫస్టాఫ్‌లో వెన్నెల కిషోర్.. సెకండాఫ్‌లో రాహుల్ రామకృష్ణ ఫన్‌ని జనరేట్ చేయడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. బ్రహ్మి మరోసారి ప్రేక్షకులను నవ్వు తెప్పించకపోగా..విసుగు తెప్పించాడు. విలన్ రోల్ లో నటించిన శత్రు పర్వాలేదు అనిపించాడు. మిగతా పాత్రల్లో నటించిన వారంతా ఓకే అనిపించారు.

సాంకేతిక వర్గం :

సినిమాకు అసలైన ప్రాణం పోసింది మాత్రం హేషామ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అనే చెప్పాలి. వినడానికి ఎంత బాగున్నాయో..తెరపై కూడా అలాగే పాటలన్నీ బాగున్నాయి. పెయిన్ ఫుల్ లవ్ స్టోరీకి ప్రాణం పోసేది నేపథ్య సంగీతమే. ఈ సినిమాలో హేషామ్ అబ్దుల్ వహాబ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాలను మరోస్థాయిలో నిలబెట్టింది. జి మురళి సినిమాటోగ్రఫీ చాలాబాగుంది. కాశ్మీర్ లొకేషన్స్‌ ను చాల బాగా చూపించారు. సమంత, విజయ్‌లను చాల ఫ్రెష్ గా చూపించి ఆకట్టుకున్నారు.

ఎడిటింగ్ విషయంలో డైరెక్టర్ ఇంకాస్త ఫోకస్ చేస్తే బాగుండు. ఫస్ట్ హాఫ్ లవ్ , కామెడీ, సాంగ్స్ తో సరదగా సాగిపోయిన..సెకండ్ హాఫ్ లో మాత్రం చాల సీన్లు సాగదీతగా అనిపించాయి. వాటిని ఎడిట్ చేస్తే బాగుండు. మైత్రి మూవీస్ నిర్మాణ విలువల గురించి ఎంత చెప్పిన తక్కువే. సినిమానే ఫ్యాషన్ గా భావించే వారు ఖర్చు కు ఏమాత్రం లెక్కచేయకుండా సినిమా బాగారావాలని కోరుకుంటారు. ఈ సినిమా విషయంలో కూడా అదే చేసారు. ఎక్కడ కూడా ఖర్చుకు వెనకడుగు వెయ్యలేదు. భారీ కాస్ట్ & క్రూ తో , భారీ వ్యయం తో సినిమాను తెరకెక్కించారు. వారు ఖర్చు చేసిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది.

ఇక డైరెక్టర్ శివ విషయానికి వస్తే..మొదటి నుండి కూడా ఫ్యామిలీ కథల వైపే మొగ్గు చూపిస్తూ వస్తున్నాడు. ఫస్ట్ హాఫ్ లో లవ్ చేసుకోవడం..ఇంటర్వెల్ టైం కు పెళ్లి చేసుకోవడం..సెకండ్ హాఫ్ లో గొడవలు పడడం..ఆ తర్వాత దగ్గరవ్వడం వంటివి రాసుకుంటూ వస్తాడు. ఈ సినిమా కథ కూడా అలాగే రాసుకున్నాడు.

BSNL ఉద్యోగి అయిన విప్లవ్.. బేగంను తొలిచూపులోనే ప్రేమించడం.. వెంటపడటం.. ప్రోపోజ్ చేయడం.. పెద్దల నుంచి అంగీకారం లభించకపోవడంతో.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం.. కొత్త కాపురం మొదలైపోవడం.. ఆ తర్వాత చిన్న ఇన్సిడెంట్ వీరిద్దరూ విడిపోయేలా చేయడం..ఆ తర్వాత మళ్లీ కలడం ఇదే ఖుషి. శివ రాసుకున్న కథ పాతదే అయినప్పటికీ..చూపించే విధానం కొత్తగా ఉంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు ప్రేక్షకులను విసుగు తెప్పిస్తాయి.క్లయిమాక్స్ లో మాత్రం అందరి చేత కన్నీరు పెట్టించు శుభం కార్డు వేసాడు. ముఖ్యంగా విజయ్ – సామ్ ను చాల బాగా చూపించి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా ఖుషి..కథ పాతదే అయినప్పటికీ..జోడి మాత్రం కొత్తగా ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kushi
  • Kushi Movie
  • Kushi review
  • kushi talk
  • Samantha
  • vijay devarakonda

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd