Vijay Antony : తనతో పాటే నేనూ చనిపోయాను.. కూతురు ఆత్మహత్యపై స్పందించిన విజయ్ ఆంటోనీ..
తన కూతురు మరణించిన తర్వాత మొదటిసారి సోషల్ మీడియా వేదికపై స్పందించాడు విజయ్ ఆంటోనీ. విజయ్ ఆంటోనీ తన ట్విట్టర్ లో ఒక లెటర్ ని పోస్ట్ చేశాడు.
- By News Desk Published Date - 06:52 AM, Fri - 22 September 23

ఇటీవల ప్రముఖ హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ(Vijay Antony) కూతురు మీరా(Meera) ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న మీరా ఇంట్లోనే తెల్లవారుజామున ఇటీవల ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులో సంచలనంగా మారింది.
కూతురి మరణంతో విజయ్ ఆంటోనీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు విజయ్ ఆంటోనీ కూతురికి నివాళులు అర్పించి విజయ్ కి ధైర్యం చెప్పారు. తాజాగా తన కూతురు మరణించిన తర్వాత మొదటిసారి సోషల్ మీడియా వేదికపై స్పందించాడు విజయ్ ఆంటోనీ. విజయ్ ఆంటోనీ తన ట్విట్టర్ లో ఒక లెటర్ ని పోస్ట్ చేశాడు.
— vijayantony (@vijayantony) September 21, 2023
విజయ్ ఆంటోనీ పోస్ట్ చేసిన లెటర్ లో.. నా కూతురు ఎంతో మంచిది. చాలా దయగలది. చాలా ధైర్యవంతురాలు. ఇప్పుడు కులం, మతం, బాధ, అసూయ, పేదరికం, ద్వేషపూరిత వాతావరణం లేని ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఆమె ఇప్పటికి నాతోనే మాట్లాడుతుంది. నాతోనే ఉంది. తనతో పాటే నేనూ చనిపోయాను. తాను కొన్ని మంచి పనులు మొదలుపెట్టింది. ఇక నుంచి నేను చేసే ప్రతి మంచిపని, సేవా కార్యక్రమాలు తనపేరు మీదే చేస్తాను అని తెలిపారు. దీంతో తమిళ్ లో రాసిన ఈ లెటర్ వైరల్ గా మారింది.
Also Read : Sai Pallavi : దండలతో సాయి పల్లవి.. సొంత కథ అల్లేసిన మీడియా..!