Vignesh Shivan : బాహుబలి శివగామిని గుర్తు చేసిన తమిళ దర్శకుడు..!
Vignesh Shivan కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ బాహుబలి శివగామి సీన్ ని గుర్తు చేశాడు. విఘ్నేష్ శివన్, నయనతారలకు ఉయిర్, ఉలగ్ ఇద్దరు పిల్లలు
- Author : Ramesh
Date : 17-06-2024 - 9:07 IST
Published By : Hashtagu Telugu Desk
Vignesh Shivan కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ బాహుబలి శివగామి సీన్ ని గుర్తు చేశాడు. విఘ్నేష్ శివన్, నయనతారలకు ఉయిర్, ఉలగ్ ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. ఐతే ఫాదర్స్ డే సందర్భంగా వాళ్లని తన చేత్తో నీళ్లల్లోంచి పైకి లేపుతూ బాహుబలి షాట్ ని గుర్తు చేశాడు విఘ్నేష్ శివన్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

విఘ్నేష్ శివన్, నయనతారలు చాలా కాలం ప్రేమించుకుని కొన్నాళ్లు సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు సరోగసి ప్రాసెస్ లో పిల్లలు పొందారు. కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా విఘ్నేష్ శివన్ ఓ పక్క సినిమాలు మరోపక్క కెరీర్ రెండిటిని సమానంగా ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Samantha Ma Inti Bangaram : సమంత బంగారం పాన్ ఇండియా ప్లానింగ్..!
ఆఫ్టర్ మ్యారేజ్ నయనతార కాస్త దూకుడు తగ్గించినట్టు అనిపిస్తుండగా మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విఘ్నేష్ శివన్ కూడా తన సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా బాహుబలి షాట్ ని రీ క్రియేట్ చేస్తూ విఘ్నేష్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.