Sankranthiki Vasthunam : వెంకీమామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. రమణ గోగుల కంబ్యాక్ అదిరిందిగా..
తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసారు.
- By News Desk Published Date - 11:10 AM, Tue - 3 December 24

Sankranthiki Vasthunam : అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. క్రైం కామెడీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుందని ప్రకటించారు.
తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసారు. ‘గోదారి గట్టు మీద రామసిలకవే..’ అంటూ సాగిన ఈ సాంగ్ మంచి బీట్ తో అదిరిపోయింది. ఈ పాటను భాస్కర భట్ల రాయగా భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వంలో రమణగోగుల, మధుప్రియ పాడారు. మీరు కూడా ఈ పాట వినేయండి..
ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి ఎన్నో హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన రమణగోగుల మళ్ళీ ఈ పాటతో ఆల్మోస్ట్ 11 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ పాటపై మరింత హైప్ వచ్చింది. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాతో అనిల్ రావిపూడి – వెంకటేష్ కాంబో హ్యాట్రిక్ హిట్ కొడతారని భావిస్తున్నారు.