HBD Venky : నవాబు లుక్ లో విక్టరీ వెంకటేశ్!
విక్టరీ వెంకటేశ్ అంటేనే వైవిధ్యం.. ఆయన నుంచి సినిమా వస్తుంటే.. మినిమమ్ గ్యారంటీ. ఇతర హీరోలు మూస ధోరణిలో సినిమాలు చేస్తుంటే.. వెంకీ మాత్రం ఎప్పుడూ నూతనత్వాన్ని కోరుకుంటూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంటారు.
- By Balu J Published Date - 01:06 PM, Mon - 13 December 21
ఇవాళ రోజు హీరో వెంకటేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న F3 నుంచి ఒక ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు చిత్ర యూనిట్. చార్మినార్ చారిత్రాత్మక ప్రదేశంలో వెంకటేష్ నవాబ్ లాగా పోజులిచ్చి తన విలక్షణమైన వ్యవహారశైలి చూడొచ్చు. డబ్బు ప్రధానంగా నడిచే ఈ మూవీలో వెంకీ చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకుని కనిపిస్తాడు. వెంకటేష్ ఇక్కడ బ్లేజర్, కార్గో ప్యాంట్ ధరించి స్టైలిష్ గెటప్‌తో పోస్టర్లో ఉన్నాడు. ఈ కొత్త పోస్టర్ ను చూసి వెంకీ అభిమానులు ఆనందపడిపోతున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంలో వెంకటేష్ మరో ఫన్ పాత్రను పోషిస్తున్నాడు. అతను అంధత్వ సమస్యతో అలరించనున్నాడు. సక్సెస్ ఫుల్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇతర ప్రధాన పాత్రలో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
Related News
Swayambhu: నిఖిల్ సినిమాలో ఒక్క ఎపిసోడ్ కోసం 8 కోట్లు ఖర్చు
Swayambhu: టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం చిత్రబృందం ప్రముఖ తారాగణంతో ఓ ఎపిక్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తోంది. వియత్నాం ఫైటర్స్ సహా 700 మంది ఆర్టిస్టులతో 12 రోజుల పాటు చిత్రీకరించనున్న ఈ ఎపిసోడ్లో నిఖిల్ కొన్ని అద్భుతమై�