HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Venkatesh Daggubati Audience Will Surely Enjoy F3

Venkatesh Daggubati: ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే సినిమా ఎఫ్3

విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి ఎఫ్3తో నవ్వులు పంచడానికి సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు.

  • Author : Balu J Date : 10-05-2022 - 4:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
F3
F3

విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఫన్ ఫ్రాంచైజీ ఎఫ్3తో థియేటర్లలో నవ్వులు పంచడానికి సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న  ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు.  ఈ రోజు విడుదలైన అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫుల్ ‘ఎఫ్3’ థియేట్రికల్ ట్రైలర్‌ కు అన్నీ వర్గాల ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. ఫన్ బ్లాస్ట్ ‘ఎఫ్3’ ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ ఎఎంబీ సినిమాస్ లో నిర్వహించారు. ఈ వేడుకలో వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, నిర్మాత శిరీష్, మెహ్రీన్, సోనాల్ చౌహాన్, అలీ, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ  ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎఫ్ 2కంటే ఎఫ్ 3 అద్భుతమైన నవ్వులు పంచాలని సినిమా చేశాం. కోవిడ్ తర్వాత నా రెండు సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఎఫ్ 3 తో మీ అందరినీ థియేటర్ లో కలుసుకోవడం ఆనందంగా వుంది. దిల్ రాజు గారు , శిరీష్, అనిల్ రావిపూడి మంచి వండర్ ఫుల్ స్క్రిప్ట్ తో వచ్చారు. ఫ్యామిలీ అంతా కలసివచ్చి ఎంజాయ్ చేసే సినిమా ఎఫ్ 3. మే 27 సినిమా థియేటర్ లోకి వస్తుంది. ఫ్యామిలీ అంతా కలసి సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఎఫ్2 మాకు ప్రాక్టీస్ మ్యాచ్ లాంటింది. ఎఫ్ 3 మెయిన్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో సిక్స్ కాదు బాల్  స్టేడియం బయటికి వెళుతుంది. కోవిడ్ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. కానీ మనందరికీ నవ్వులు తీసుకొచ్చే చిత్రం మాత్రం ఎఫ్ 3. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీస్ తో వచ్చి సినిమా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది. ట్రైలర్ లో చూపించింది సినిమాలో ఒక్క శాతం మాత్రమే. సినిమాలో డబుల్ ఫన్ వుంటుంది, వెంకటేష్ గారితో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్.  ఎఫ్ 2కి మించి ఎంజాయ్ చేశాం” అన్నారు

బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఎఫ్ 3 ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడం గ్రేట్ ఎనర్జీ ఇచ్చింది. ఎఫ్2 కి మించి ఎఫ్ 3 సినిమాని ఎంజాయ్ చేయబోతున్నారు.  ఎఫ్ 3 లో మూడో ఎఫ్ కి మీనింగ్ ఏంటని అడుగుతున్నారు. ఎఫ్ ఫర్ ఫ్యామిలీ.  ఎఫ్2 ఆదరించిన అందరూ మా ఫ్యామిలీనే. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఈ సినిమాని చేయడానికి కారణం కమర్షియల్ గా ఫ్రాంచైజీ కంటిన్యూ చేసి డబ్బులు చేసుకోవాలనే ఉద్దేశం కాదు. ఎఫ్ 2 రిలీజ్ అయిన తర్వాత తిరుపతి వెళ్ళినపుడు ఒక థియేటర్ లో సినిమా రెస్పాన్స్ చూశా. ఒక ఫ్యామిలీ మొత్తం వరుసలో కూర్చుని హాయిగా ఆనందంగా నవ్వుకోవడం చూశాను. ఒకరిని నవ్వించడం ఎంత కిక్ వుంటుందో అప్పుడు అర్ధమైయింది. అందుకే ఎఫ్ 3ని స్టార్ట్ చేశా. ఈ సినిమాని మీరు ఆదరిస్తే ఎఫ్ 4 తీయడానికి కూడా రెడీ. ఎఫ్ 2ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో నటీనటులంతా ఎఫ్ 3 చేశారు. ఆల్రెడీ హిట్ కొట్టేశామనే నమ్మకంతో యాక్ట్ చేశారు. వెంకటేష్ గారు ఎంటర్ టైనర్ చేయడంలో ఎవరెస్ట్. ఆయన ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. వరుణ్ తేజ్ మై బ్రదర్.  వరుణ్ తేజ్ గారి ఫన్ టైమింగ్ అదిరిపోతుంది.  తమన్నా రోల్ ఎఫ్ 2కి మించి వుంటుంది. తమన్నా, సోనాల్ కి సంబధించి ఒక సర్ ప్రైజ్ వుంది. అది థియేటర్ లో తెలుస్తుంది. నిర్మతలు దిల్ రాజు శిరీష్ గారు నా బ్యాక్ బోన్. శిరీష్ గారు ఇప్పటికే సినిమాని 20 సార్లు చూస్తుంటారు. ఎప్పుడు చూసిన ఫస్ట్ టైం చుసినట్లే తెగ నవ్వుకుంటారు. ట్రైలర్ చూసి ఎంత నవ్వుకున్నారో సినిమా చూసి అంతకు మించి నవ్వుకుంటారు. ప్రామిస్” అన్నారు

హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ.. ఎఫ్ 3మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. అనిల్ రావిపూడి గారు వన్ మ్యాన్ ఆర్మీ. ఇందులో అద్భుతమైన పాత్ర ఇచ్చారు.  వెంకటేష్, వరుణ్, మెహ్రీన్.. ఇలా అందరితో మళ్ళీ పని చేయడం ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత దిల్ రాజు, శిరీష్ గారి ధన్యవాదాలు” అన్నారు. హీరోయిన్ మెహ్రీన్  మాట్లాడుతూ.. మే 27 సినిమావస్తుంది. మూడేళ్ళ తర్వాత ఎఫ్ 2ఫ్రాంచైజీ నుండి వస్తున్న ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచుస్తున్నా. సినిమాని ఎంజాయ్  చేసి పెద్ద బ్లాక్ బస్టర్ విజయం ఇవ్వాలనికోరుతున్నాను” అన్నారు. నటుడు అలీ మాట్లాడుతూ.. ఎఫ్ 2 కంటే ఎఫ్ 3 అదిరిపోతుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ ఈ సినిమాని హెర్క్యులస్ గ్లోబ్ మోసినట్లు మోశారు. అనిల్ రావిపూడి గారి కలం .. ఈ సినిమాకి బలం. నాకు అద్భుతమైన పాత్ర ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి , దిల్ రాజుగారి ధన్యవాదాలు” అన్నారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Daggubati Venkatesh
  • success meet
  • theatrical trailer
  • Varun Tej

Related News

Venkatesh reunites with Anil Ravipudi

వెంకీ-కళ్యాణ్ రామ్ తో అనిల్ రావిపూడి మల్టీస్టారర్

Anil Ravipudi విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మరో కొత్త సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ వంటి హిట్ చిత్రాల తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రలో కనిపించనున్

    Latest News

    • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

    • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

    • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

    • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

    • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd