Operation Valentine : వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్‘ రిలీజ్ డేట్ వచ్చేసింది
ఇందులో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా కనిపించబోతున్నారు
- Author : Sudheer
Date : 14-08-2023 - 2:45 IST
Published By : Hashtagu Telugu Desk
కెరియర్ మొదటినుండి హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా భిన్న కథలను ఎంచుకుంటూ వస్తున్న వరుణ్..ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపధ్య కథ (Indian Air Force action film)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా తాలూకా టైటిల్ & రిలీజ్ డేట్ ను మేకర్స్ ఈరోజు సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘ఆపరేషన్ వాలెంటైన్‘ (Operation Valentine) అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.
ఈ మూవీ లో వరణ్ తేజ్ (Varun Tej) కు జోడిగా మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ (Manushi Chhillar) హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అంత పూర్తి అయ్యింది. యాక్షన్ డ్రామా రూపొందుతున్న ఈ సినిమాలో మానుషి ‘రాడార్ ఆఫీసర్’ గా కనిపించబోతుంది. ఇందులో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా కనిపించబోతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. న్యాయవాదిగా ఉన్న ప్రతాప్ సింగ్ (Shakti Pratap Singh Hada) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టంతో ఆయన ఇప్పటికే పలు యాడ్ ఫిల్మ్స్ చేశారు. ఈ సినిమా కథ కోసం చాలా రీసెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. వరుణ్ కెరీర్ లో ఈ చిత్రం తొలి హిందీ మూవీగా నిలువబోతోంది. భారతీయ వాయుసేనలో జరిగిన కొన్న వాస్తవ సంఘటనల ప్రేరణతో ‘ఆపరేషన్ వాలెంటైన్‘ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. డిసెంబర్ 8 , 2023 న ఈ చిత్రం థియేటర్లలోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు వరుణ్ తేజ్ రిలీజ్ డేట్ అనౌన్స్ పోస్టర్ ను తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు. ‘భారతీయ గర్జన ఆకాశమంతా ప్రతిధ్వనించబోతోంది’ అని ఆయన క్యాప్షన్ పెట్టారు. అలాగే వరుణ్ నటించిన ‘గాంఢీవధారి అర్జున’ మూవీ ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు.