Matka Teaser Talk : వరుణ్ తేజ్ మట్కా టీజర్ టాక్..!
Matka Teaser Talk కంప్లీట్ మాస్ లుక్ తో సూపర్ గా ఉన్నాడు. మెగా హీరోగా తన ప్రతి సినిమాతో కొత్త ప్రయత్నాలు చేస్తున్న వరుణ్ తేజ్ కెరీర్ లో సక్సెస్ రేటులో మాత్రం
- Author : Ramesh
Date : 05-10-2024 - 4:46 IST
Published By : Hashtagu Telugu Desk
Matka Teaser Talk మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా మట్కా. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా టీజర్ రిలీజైంది. టీజర్ చూస్తే ఇదేదో K.G.F రేంజ్ కథ లానే అనిపిస్తుంది. ఒక గ్యాంగ్ స్టర్ కథతో వరుణ్ తేజ్ డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపిస్తున్నాడు. టీజర్ మొత్తం మాస్ ఆడియన్స్ కి ఎక్కేలానే ఉంది. అంతేకాదు డైలాగ్స్ కూడా ఇంప్రెస్ చేసేలా ఉన్నాయి.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ (Varun Tej,) కంప్లీట్ మాస్ లుక్ తో సూపర్ గా ఉన్నాడు. మెగా హీరోగా తన ప్రతి సినిమాతో కొత్త ప్రయత్నాలు చేస్తున్న వరుణ్ తేజ్ కెరీర్ లో సక్సెస్ రేటులో మాత్రం వెనకబడి ఉన్నాడు. ఐతే ఈసారి మట్కా అంటూ మాస్ మసాలా సినిమాతో రాబోతున్నాడు. టీజర్ చూసిన ఆడియన్స్ కు కె.జి.ఎఫ్ రిఫరెన్స్ గుర్తుకు రాక మానదు.
వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి..
సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా నటిస్తుంది. మట్కా సినిమాను తెలుగుతో పాటు పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. టీజర్ లోని మాస్ అప్పీల్ చూస్తుంటే కచ్చితంగా నేషనల్ లెవెల్ ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా ఉంది. వరుణ్ తేజ్ మట్కా సినిమా మెగా ఫ్యాన్స్ ని మెప్పిస్తుందా టీజర్ లో ఉన్న కంటెంట్ సినిమాలో ఉంటుందా అన్నది చూడాలి.
వరుణ్ తేజ్ మట్కా టీజర్ లో ఎక్కువగా అతను సిగార్ కాల్చే సీన్ ను చూస్తేనే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధమవుతుంది. మరి కొన్నాళ్లుగా సూపర్ హిట్ కోసం ఆశగా ఉన్న మెగా ప్రిన్స్ కు సూపర్ హిట్ సినిమాగా మట్కా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.