Varun lavanya : వరుణ్ లావణ్య.. మరోసారి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ఈసారి అల్లువారింట..
ఇటీవల హైదరాబాద్ లో వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చిరంజీవి ఇంట్లో ఘనంగా జరిగాయి. తాజాగా ఈ జంట మరోసారి ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ చేసుకుంది.
- Author : News Desk
Date : 16-10-2023 - 8:49 IST
Published By : Hashtagu Telugu Desk
మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గత ఆరేళ్లుగా ఎవరికీ తెలియకుండా ప్రేమించుకొని ఇటీవల సడెన్ గా నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. వరుణ్ లావణ్య పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలియడంతో షాక్ అయి ఆనందం వ్యక్తపరుస్తున్నారు అభిమానులు. ఇక పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి.
ఇప్పటికే ఈ ఇద్దరూ బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా దగ్గర పెళ్ళికి స్పెషల్ గా బట్టలు డిజైన్ చేయించుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చిరంజీవి ఇంట్లో ఘనంగా జరిగాయి. మెగా ఫ్యామిలీ అంతా దీనికి హాజరవ్వగా ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ జంట మరోసారి ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ చేసుకుంది.
ఈసారి అల్లు వారింటి వద్ద వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్(Pre Wedding Celebrations) చేసుకున్నారు. అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ, అల్లు అరవింద్, స్నేహ రెడ్డి.. ఇలా అల్లు ఫ్యామిలీ అంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వీరితో పాటు మెగా ఫ్యామిలీ కూడా పాల్గొంది. వరుణ్, లావణ్య ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక వీరిద్దరూ ఇటలీలో నవంబర్ లో వివాహం చేసుకోబోతున్నారు.
Also Read : Ravi Teja: రవితేజ టైగర్ నాగేశ్వర రావు మేకింగ్ వీడియో చూశారా