Hyper Aadi : వర్షిణి నో చెప్పింది.. మరి హైపర్ ఆది ప్రేమించేది ఆ అమ్మాయినేనా?
కొంతకాలం నుంచి హైపర్ ఆది యాంకర్ వర్షిణి(Anchor Varshini) తో ప్రేమలో ఉన్నాడని, వాళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి.
- Author : News Desk
Date : 15-08-2023 - 7:26 IST
Published By : Hashtagu Telugu Desk
రైటర్ గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది(Hyper Aadi) ఆ తర్వాత కమెడియన్ గా మారి జబర్దస్త్(Jabardasth) తో బాగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం కమెడియన్ గా సినిమాలు, టీవీ షోలతో బాగా బిజీగా ఉన్నాడు హైపర్ ఆది. గత కొంతకాలం నుంచి హైపర్ ఆది యాంకర్ వర్షిణి(Anchor Varshini) తో ప్రేమలో ఉన్నాడని, వాళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి.
అయితే యాంకర్ వర్షిణి ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దీనిపై స్పందిస్తూ.. అవన్నీ అబద్ధపు వార్తలు. మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. నేను ఎవరితోనూ ప్రేమలో లేను అని తెలిపింది. దీంతో హైపర్ ఆది – యాంకర్ వర్షిణి మధ్య రిలేషన్ ఏం లేదని క్లారిటీ వచ్చేసింది. తాజాగా హైపర్ ఆది ప్రేమలో ఉన్నాడని మరో పేరు వినిపిస్తుంది. స్వయంగా ఆదినే ఆ అమ్మయిని పరిచయం చేయడం విశేషం.
శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో ఆది కనిపిస్తాడని తెలిసిందే. తాజాగా రిలీజయిన ఆ షో ప్రోమోలో హైపర్ ఆది తన నిజమైన ప్రేమని పరిచయం చేస్తాను అంటూ ఒక అమ్మాయిని స్టేజిపైకి పిలిచి నేను నిజంగా ప్రేమించేది ఈ అమ్మాయినే అని చెప్పి ఐ లవ్ యు విహారిక అని స్టేజి మీద ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి కూడా ఐ లవ్ యు ఆది అని చెప్పింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. విహారిక అనే ఆ అమ్మాయి అయితే ఇప్పటిదాకా టీవీలో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఇది నిజమేనా లేకా ఇది కూడా టీవీ షో కోసం చేశారా అనేది చూడాలి మరి.
Also Read : Chiranjeevi Knee Surgery : ఢిల్లీలో చిరంజీవి మోకాలికి ఆపరేషన్ పూర్తి