Vadivelu Brother Dies : సినీ నటుడు వడివేలు ఇంట మరో విషాదం
గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన మధురైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు
- Author : Sudheer
Date : 28-08-2023 - 7:01 IST
Published By : Hashtagu Telugu Desk
చిత్రసీమలో వరుస విషాదాలు ఆగడం లేదు. ఒకరు కాకపోతే ఒకరు పలు కారణాలతో కన్నుమూస్తున్నారు. తాజాగా నటుడు వడివేలు ( Vadivelu ) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు జగదీశ్వరన్ ( Vdivelu Brother Jagadeeswaran dies) (55) ఆదివారం (ఆగస్టు 27) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన మధురైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా కొన్ని నెలల క్రితమే వడివేలు తల్లి మరణించింది. ఈ విషాదం నుండి ఇంకా తేరుకోకముందే ఇప్పుడు ఆయన సోదరుడు మృతి చెందడం మరింత కుంగదీసింది.
Read Also : NTR Coin : ఆన్లైన్ లో ఎన్టీఆర్ నాణెం..ధర ఎంతో తెలుసా..?
జగదీశ్వరన్ కూడా నటుడే. ఆయన కొన్ని సినిమాల్లో నటించారు. శింబు హీరోగా వచ్చిన `కాదల్ అలైవిట్టలై` (Kadhal Azhivathillai) సినిమాతో సహా పలు చిత్రాల్లో నటించారు. కానీ జగదీశ్వరన్ నటుడిగా సెట్ కాలేదు. సినిమా ఛాన్స్ లు రాలేదు. దీంతో కొన్నాళ్లకే ఆయన సినిమా పరిశ్రమని వదిలేశారు. సొంత ఇంటి(మధురై)కి వెళ్లిపోయారు. అక్కడ బట్టల షాపు నిర్వహిస్తున్నారు. ఇక కమెడియన్ గా వడివేలు ఎంత పాపులరో…ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తమిళ్‌తో పాటు తెలుగులో సుమారు 200కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా చంద్రముఖి సినిమాలో వడివేలు పోషించిన పాత్రను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఇక 23వ పులకేశి సినిమాతో కథానాయకుడిగానూ అదృష్టం పరీక్షించుకున్నారు. కాగా త్వరలో రిలీజ్ కానున్న చంద్రముఖి 2 సినిమాలోనూ ఆయన కనిపించనున్నారు.