Trisha త్రిష తాకిడికి వాళ్లలో గుబులు..!
ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క అమ్మడు ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. త్రిష కెరీర్ లో ఫస్ట్ టైం ఒక వెబ్ సీరీస్ లో నటించింది. బృంద అనే వెబ్ సీరీస్
- By Ramesh Published Date - 04:15 PM, Mon - 5 August 24

Trisha సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 20 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ అమ్మడు ఒక రేంజ్ ఫాం కొనసాగిస్తుని. రెండు దశాబ్ధాల కెరీర్ పూర్తి చేసుకున్న తర్వాత కూడా త్రిష హీరోయిన్ గా స్టార్ ఛాన్సులు అందుకుంటుంది అంటే ఆమె రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో ఏమో కానీ కోలీవుడ్ లో త్రిష సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తుంది. అక్కడ అమ్మడికి సినిమా సినిమాకు ఇమేజ్ డబుల్ అవుతుంది. అందుకే వరుస ఛాన్సులు వస్తున్నాయి.
రీసెంట్ గానే పి.ఎస్ 1, 2 సినిమాల్లో నటించిన త్రిష దళపతి విజయ్ లియోలో కూడా జత కట్టింది. విజయ్ నుంచి వస్తున్న గోట్ సినిమాలో కూడా త్రిష నటిస్తుంది. ఐతే ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క అమ్మడు ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. త్రిష కెరీర్ లో ఫస్ట్ టైం ఒక వెబ్ సీరీస్ లో నటించింది. బృంద అనే వెబ్ సీరీస్ రీసెంట్ గా సోనీ లివ్ లో రిలీజైంది.
ఆ వెబ్ సీరీస్ కు కూడా మంచి టాక్ వచ్చింది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన బృంద (Brinda) సీరీస్ లో త్రిష పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఓటీటీలో కూడా త్రిష హిట్ కొట్టడం చూసి మిగతా హీరోయిన్స్ అంతా షాక్ అవుతున్నారు. త్రిష ఇటు సిల్వర్ స్క్రీన్ అటు డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొట్టేస్తుంది. త్రిష వరుస సినిమాల తాకిడికి యువ హీరోయిన్స్ గుండెల్లో కూడా గుబులు పుడుతుంది.
ఇక తన ప్రతి అప్డేట్ తో సోషల్ మీడియాలో కూడా తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే త్రిష ఈ దూకుడు చూస్తుంటే మరో పదేళ్లు అయినా అమ్మడికి ఏమాత్రం క్రేజ్ తగ్గేలా లేదనిపిస్తుంది. త్రిష ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర సినిమాలో లీడ్ హీరోయిన్ గా చేస్తుంది.
Also Read : Nandamuri Mokshagna : జాన్వి చెల్లితో వారసుడి రొమాన్స్.. ప్లాన్ అదుర్స్..!