Mahesh Choose Pokiri Date: ‘పోకిరి’ డేట్ పై కన్నేసిన మహేశ్!
విజయవంతమైన కాంబినేషన్ మరోసారి SSMB28తో మాయ చేయబోతోంది.
- By Balu J Published Date - 02:32 PM, Fri - 19 August 22

విజయవంతమైన కాంబినేషన్ మరోసారి SSMB28తో మాయ చేయబోతోంది. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల హ్యాట్రిక్ చిత్రం టాలీవుడ్‌లో షూటింగ్‌లు తిరిగి ప్రారంభించిన వెంటనే ప్రారంభం కానుంది. తాజాగా మేకర్స్ విడుదల తేదీకి సంబంధించిన పెద్ద అప్‌డేట్‌తో ముందుకు వచ్చారు. SSMB28 ఏప్రిల్ 28, 2023న వస్తుంది. అయితే యాదృచ్ఛికంగా మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ పోకిరి కూడా 2006లో అదే తేదీన విడుదలైంది.
ఇప్పటికే ప్రారంభోత్సవ వేడుకలు జరుపుకున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మహేష్ బాబు విభిన్నమైన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్‌పై ఎస్ రాధాకృష్ణ గ్రాండ్‌గా నిర్మించనున్నారు. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ గా నిర్వహించనున్నారు.