HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tollywood King Nagarjuna Worried About His Sons Future

నాగ్ కు సన్ స్ట్రోక్.. కొడుకుల భవిష్యత్తుపై బెంగ?

టాలీవుడ్ హీరోల్లో అక్కినేని నాగార్జునది ప్రత్యేక స్థానం. ఒకవైపు మనసుకు నచ్చిన సినిమాలు చేస్తూ, మరోవైపు ఇతర బిజినెస్ వ్యాపకాలతో బిజీబిజీగా ఉంటారు. ఏదైనా ప్రాజెక్టు టెకోవర్ చేస్తే.. దాన్ని ముగించేవరకూ పట్టువదలడు.

  • Author : Balu J Date : 20-10-2021 - 2:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

టాలీవుడ్ హీరోల్లో అక్కినేని నాగార్జునది ప్రత్యేక స్థానం. ఒకవైపు మనసుకు నచ్చిన సినిమాలు చేస్తూ, మరోవైపు ఇతర బిజినెస్ వ్యాపకాలతో బిజీబిజీగా ఉంటారు. ఏదైనా ప్రాజెక్టు టెకోవర్ చేస్తే.. దాన్ని ముగించేవరకూ పట్టువదలడు. మిగతా హీరోలు కమర్షియల్ అంటూ పరుగులు తీస్తుంటే.. నాగ్ మాత్రం కొత్తదనం కోసం పరితపిస్తుంటారు. కొత్త కొత్త దర్శకులకు అవకాశాలను ఇస్తుంటాడు. అయితే ఆయన బాక్సాఫీస్ రేసులో భారీ కలెక్షన్లు రాబట్టకపోయినా.. సినిమాలు మాత్రం గుడ్ అనిపించుకుంటాయి. ఎప్పడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే నాగ్ ఈమధ్య బాగా డీలా పడిపోయాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

చైసామ్ విడిపోవడంతో..

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ ఏదంటే.. ప్రతిఒక్కరికీ నాగచైతన్య, సమంత జంట మొదటగా గుర్తుకొస్తుంది. ఎంతో అప్యాయతగా ఉండే ఈ జంట విడిపోవడంతో ఇండ్రస్టీకే కాకుండా.. తెలుగు ప్రేక్షకులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. దాదాపు నాలుగేళ్ల బంధానికి బ్రేక్ పడటంతో అక్కినేనికి కుటుంబానికి పెద్ద దెబ్బ తగిలినట్లయింది. ఈ జంట విడిపోయి రెండు వారాలు కావొస్తున్నా.. నాగార్జున మాత్రం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారట. గోవాలో సినీ ప్రముఖుల మధ్య ఒక్కటైన జంట విడిపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. సంతా సవ్యంగా సాగుతున్న నాగచైతన్య పర్సనల్ కెరీర్ గాడితప్పడంతో నాగార్జున బెంగ పెట్టుకున్నారు. గతంలోనే అఖిల్ పెళ్లి క్యాన్సిల్ కావడం, రీసెంట్ గా చైతూ వివాహ బంధానికి గుడ్ బై చెప్పడం నాగ్ ను మానసికంగా కుంగదీశాయని దగ్గరివాళ్లు చెప్తున్నారు.

అఖిల్ కెరీర్ అంతంతమాత్రమే..

అందానికి అందం, బలమైన బ్యాగ్రౌండ్ ఉండీ కూడా అఖిల్ కెరీర్ సోసో అన్నట్టుగా సాగుతుండటం కూడా నాగ్ కు తలనొప్పిగా మారిందట. ఇప్పటివరకు అఖిల్ ముచ్చటగా మూడు సినిమాలు తీసినా, వాటిల్లో ఏ ఒక్కటి హిట్ కాకపోవడం, అఖిల్ నటనకు మంచి మార్కులు పడకపోవడం కూడా నాగ్ ను ఆలోచనల్లో పడేసేలా చేశాయి. అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ చైతూ నటించి లవ్ స్టోరీ సినిమాలు హిట్ టాక్స్ సొంతం చేసుకున్నా.. నాగార్జున మొహంలో సంతోషం కనిపించడం లేదు. ఇదే విషయమై ఓ మీడియా రిపోర్టర్ ను నాగ్ ను ప్రశ్నించగా.. “ఇద్దరు ఎంతగా ఆందోళన చెందుతున్నా, విధి మారదు. నా అబ్బాయిలిద్దరూ జీవితంలో వారి స్వంత వ్యక్తిగత ప్రయాణాన్ని కలిగి ఉంటారు. వారి వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు తప్పక ఉంటాయి. వారు సమర్థులైన, బాధ్యతాయుతమైన యువకులు. నేను జీవితంలో వారు తమ స్థానాన్ని కనుగొంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, ” అంటూ సమాధానమిచ్చారు.

నాగ్ కు హిట్ ఏదీ?

చివరకు అఖిల్ సైతం ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ మూవీతో హిట్ కొట్టాడు. ఇక చైతూ ‘లవ్ స్టోరీ’తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సొంతం చేసుకున్నాడు. కొడులిద్దరూ హిట్స్ సాధించడం కొంతవరకు సంతోషం మిగిల్చినా.. నాగ్ కు ఈ మధ్య మంచి హిట్ పడలేదనే చెప్పాలి. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల్లో అన్నపూర్ణ స్టూడియో, సినిమా కెరీర్ ఇవన్నీ నాగ్ ను అయోమయంలోకి నెట్టేశాయని చెప్పక తప్పదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • akkineni
  • chitu
  • cinema
  • hero akhil
  • king nag
  • Samantha
  • ups and down
  • అఖిల్
  • చైతూ
  • తెలుగు సినిమా
  • నాగార్జున

Related News

Samantha

Samantha: భ‌ర్త‌కు షాక్ ఇచ్చిన స‌మంత‌.. అస‌లు మేట‌ర్ ఏంటంటే?!

నేటి మార్పులకు అనుగుణంగా సినిమా తీయడం గురించి మాట్లాడుతూ.. కాలంతో పాటు థీమ్స్ మారుతూ ఉంటాయి, అది సమస్య కాదు. రీల్స్ లాంటివి వీక్షించే అలవాట్లను, దృష్టిని కేంద్రీకరించే వ్యవధిని భారీగా మార్చాయి.

    Latest News

    • పంజాబ్‌లో కబడ్డీ క్రీడాకారుడి దారుణ హత్య

    • భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20.. ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడాలి?

    • కరోనా కంటే ప్రమాదకరమైన ‘సబ్‌క్లేడ్ K’ ఫ్లూ.. అమెరికాలో వేగంగా వ్యాప్తి!

    • 2026లో భారత మార్కెట్లోకి రాబోయే కొత్త కార్లు ఇవే!

    • టీమిండియా ఆట‌గాడికి అనారోగ్యం.. టీ20 సిరీస్ నుంచి ఔట్‌!

    Trending News

      • రూ. 25,000 జీతంలో డబ్బు ఆదా చేయడం ఎలా?

      • Messi: సచిన్ టెండూల్క‌ర్‌, సునీల్‌ ఛెత్రిని కలవనున్న మెస్సీ!

      • ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

      • Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

      • ICC- JioStar: ఐసీసీ- జియోస్టార్ డీల్ పై బ్రేక్.. పుకార్లను ఖండించిన ఇరు సంస్థలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd