Lucky Bhaskar : లక్కీ భాస్కర్ చేయాల్సిన తెలుగు హీరో అతనేనా.. హిట్ సినిమా మిస్..!
Lucky Bhaskar దుల్కర్ కి జతగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడమే
- By Ramesh Published Date - 10:06 PM, Sun - 3 November 24

దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా లక్కీ భాస్కర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో దుల్కర్ కి జతగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాకుండా వసూళ్లతో కూడా అదరగొడుతుంది. ఈ సినిమాతో దుల్కర్ తెలుగులో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు.
తెలుగు హీరో కోసమే..
1990 కాలం నాటి కథతో తెరకెక్కిన లక్కీ భాస్కర్ (Lucky Bhaskar) సినిమా బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంతో మిడిల్ క్లాస్ వ్యక్తి జీవితాన్ని అర్ధం పట్టేలా చేసింది. ఈ సినిమాకు జివి ప్రకాష్ మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఐతే లక్కీ భాస్కర్ సినిమాను వెంకీ అట్లూరి మొదట తెలుగు హీరో కోసమే రాసుకున్నాడట. కానీ అతను కాదని చెప్పడంతో దుల్కర్ దాకా వెళ్లినట్టు తెలుస్తుంది.
దుల్కర్ కంటే ముందు వెంకీ అట్లూరి ఈ సినిమాను న్యాచురల్ స్టార్ నాని(Nani) కి వినిపించాడట. ఐతే నాని ఆల్రెడీ తండ్రిగా ఇప్పటికే జెర్సీ, హాయ్ నాన్న సినిమాలు చేశాడు. మరో సినిమా అంటే కష్టమని అన్నాడట. అందుకే లక్కీ భాస్కర్ ని కాదన్నాడట. ఐతె దుల్కర్ సల్మాన్ మాత్రం లక్కీగా ఈ ఆఫర్ అందుకున్నాడు. డైరెక్టర్ మీద నమ్మకం పెట్టిన దుల్కర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.
కథల ఎంపికలో దుల్కర్ తన స్పెషాలిటీ చాటుతున్నాడు. మహానటి నుంచి లక్కీ భాస్కర్ వరకు వేరే హీరో అయితే ఆ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో అన్న రేంజ్ లో తన స్టోరీ సెలక్షన్ ఉంది.