Kajal Comeback: కాజల్ వచ్చేస్తోంది.. ‘ఇండియన్ 2’ తో కమ్ బ్యాక్!
కాజల్ అగర్వాల్ మళ్లీ కెమెరా ముందుకొస్తున్నారు.
- By Balu J Updated On - 12:56 PM, Fri - 5 August 22

కాజల్ అగర్వాల్ మళ్లీ కెమెరా ముందుకొస్తున్నారు. మూడు నెలల క్రితం కాజల్ మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు నీల్ అని పేరు పెట్టింది. వచ్చే నెల నుంచి మళ్లీ సినిమాలకు శ్రీకారం చుట్టనుంది. గురువారం కాజల్ అగర్వాల్ నటి నేహా ధూపియాతో మాతృత్వం గురించి వీడియో సంభాషణ చేసింది. ఈ చాట్‌లో కాజల్ అగర్వాల్ సినిమా సెట్స్‌పైకి తిరిగి వస్తున్నట్లు ప్రకటించింది. “సెప్టెంబర్ 13 న నేను ఇండియన్ 2 లో నా షెడ్యూల్ ను ప్రారంభిస్తా” అని ఆమె చెప్పింది.
శంకర్ దర్శకత్వం వహించిన “ఇండియన్ 2”లో కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. శంకర్‌కి, నిర్మాతకు మధ్య విభేదాల కారణంగా నెలల తరబడి షూటింగ్ ఆగిపోయింది. శంకర్ ఆ తర్వాత రామ్ చరణ్ సినిమాని టేకప్ చేసి సినిమా చేస్తున్నాడు. కమల్ హాసన్ “విక్రమ్” భారీ విజయం తర్వాత, శంకర్ ‘ఇండియన్ 2’ నిర్మాత తమ విభేదాలను పక్కనపెట్టి, ప్రాజెక్ట్ను మళ్లీ ప్రారంభించేందుకు అంగీకరించారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కాజల్ అగర్వాల్ షూటింగ్‌లో జాయిన్ అవుతుంది. రామ్ చరణ్ సినిమా “భారతీయుడు 2” రెండింటినీ శంకర్ ఏకకాలంలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.
#KajalAggarwal to return to work after pregnancy, will resume #Indian2 shoot on THIS datehttps://t.co/PSlxXxo8mU
— India Today Showbiz (@Showbiz_IT) August 5, 2022
Related News

Nithiin: ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్!
యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'మాచర్ల నియోజకవర్గం' పై భారీ అంచనాలు వున్నాయి.