Ramya Krishna Pics: లేటు వయసులోనూ తరగని అందాలు
రమ్యకృష్ణ అనగానే.. నీలంబరి, శివగామి లాంటి పాత్రలు కళ్ల ముందు కదలాడుతాయి.
- By Balu J Published Date - 02:51 PM, Mon - 15 August 22

రమ్యకృష్ణ అనగానే.. నీలంబరి, శివగామి లాంటి పాత్రలు కళ్ల ముందు కదలాడుతాయి. ఇదంతా ఒకవైపు మాత్రమే.. మరోవైపు వయసు పైబడుతున్నా తన అందాలతో మాయ చేస్తోంది సీనియర్ నటి. నేటికి చక్కని ఫిట్ నెస్ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. ఈ బ్యూటీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగల్ నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్లలో భాగంగా కెమెరాకు ఫొజులిచ్చింది. ఉల్లిపొరలాంటి తేలికైన చీర కట్టుకొని ఇప్పటి తరం హీరోయిన్లను తలదన్నేలా కుర్రకారు మతులు పోగొడుతోంది.
కెమెరాకు ఫొజులిస్తున్న సమయంలో గాలికి ఆమె కట్టుకున్న చీర చెదురుతుంటే సరిదిద్దుకుంటూ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు సైతం ఈ వయసులో నీకు ఇలాంటి చీర అవసరమా అంటూ కామెంట్లు చేస్తూ విమర్శించగా, మరికొందరు మేడం మీరు సూపర్ అంటూ ఫిదా అవుతున్నారు నెటిజన్స్.