Jagapathi Babu About Politics: నా లాంటివాడు రాజకీయాలకు పనికిరాడు!
జగపతి బాబు.. ఒకప్పుడు తెలుగు తెరపై హీరోగా వెలిగిపోయాడు. ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలతో అలరించాడు.
- Author : Balu J
Date : 02-08-2022 - 12:27 IST
Published By : Hashtagu Telugu Desk
జగపతి బాబు.. ఒకప్పుడు తెలుగు తెరపై హీరోగా వెలిగిపోయాడు. ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలతో అలరించాడు. కాలం కలిసిరాకపోవడంతో సెకండ్ ఇన్సింగ్స్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోలతో సమానంగా దూసుకుపోతున్నాడు. అయితే స్టైలిష్ విలన్ ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన పరంపర-2 అందర్నీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మోహన్ రావుగా నటించిన జగపతి బాబు యాక్టింగ్ నెక్ట్స్ లెవల్ అని చెప్పక తప్పదు. రాజకీయాలు, ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కిన ఆ పరంపర వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో జగపతిబాబు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా ఒక మాయ అయితే, పాలిటిక్స్ మరో మాయాలోకం అని అన్నారు. రాజకీయాల గురించి నేను ఆలోచించను అనీ, నాలాంటి వాడికి రాజకీయాలు సరిపోవు అని పేర్కొన్నారు. నాకు అంత ఓపిక, తెలివి కూడా లేదని జగపతిబాబు అన్నారు. అయితే రాజకీయ నాయకులను కలుస్తానని, కానీ నాకు రాజకీయాలు సూట్ కావు అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం జగపతి బాబు కామెంట్స్ వైరల్ గా మారాయి.