Tillu Square Talk : టిల్లు స్క్వేర్ పబ్లిక్ టాక్..
సినిమా చూసిన ప్రతి ఒక్కరు టిల్లు కుమ్మేసాడని..అనుపమ గ్లామర్ తో చూపు తిప్పుకోకుండా చేసిందని.. డీజే టిల్లు సినిమాకు మించి.. ఇందులో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని చెపుతున్నారు
- By Sudheer Published Date - 10:20 AM, Fri - 29 March 24

సిద్ధూ జొన్నలగడ్డ (Siddu ) , అనుపమ (Anupama ) జంటగా మల్లిక్ రామ్ (Mallik Ram) డైరెక్షన్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన మూవీ ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). భారీ అంచనాల నడుమ ఈరోజు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘డీజే టిల్లు’ మూవీ తో ‘టిల్లు’గా యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).. ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ (Tillu Square) కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. ఈ మూవీ ప్రకటనతోనే అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి. ‘రాధిక’, ‘టికెటే కొనకుండా’, ‘ఓ మై లిల్లీ’ సాంగ్స్ తో పాటు టీజర్ , ట్రైలర్ ఇంకాస్త హైప్ పెంచాయి. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న వేళ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
సినిమా చూసిన ప్రతి ఒక్కరు టిల్లు కుమ్మేసాడని..అనుపమ గ్లామర్ తో చూపు తిప్పుకోకుండా చేసిందని.. డీజే టిల్లు సినిమాకు మించి.. ఇందులో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని చెపుతున్నారు. కామెడీ , యాక్షన్ , లవ్ , రొమాన్స్ ఇలా అన్ని మిక్స్ చేసి ప్రేక్షకులకు ఫుల్ వినోదాన్ని పంచారని చెపుతున్నారు. సినిమా మొత్తాన్ని సిద్ధూ తన భూజాలపై నిలబెట్టాడని.. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఆసక్తి కలిగించిందని అంటున్నారు. టిల్లు స్క్వేర్ పూర్తిగా 2 గంటల ఫన్ రైడ్ అని.. ఇక ఈ మూవీలో అనుపమ స్క్రీన్ ప్రెజన్స్ బాగుందని.. మొత్తానికి ఈసినిమా వినోదాన్ని పంచే రోలర్ కోస్టర్ అని అంటున్నారు. పబ్లిక్ టాక్ తో మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
Read Also : Rain Tax: కెనడాలో ప్రజలపై ‘రెయిన్ ట్యాక్స్’.. కారణమిదే..?