Mega156: మెగాస్టార్ చిరంజీవి 156 టైటిల్ ఇదే
ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి మెగా అభిమానులు అంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
- By Balu J Published Date - 05:42 PM, Wed - 1 November 23
Mega156: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వశిష్ట మల్లిది (బింబిసార ఫేమ్) రాబోయే సోషియో-ఫాంటసీ చిత్రం (మెగా 156) కోసం చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్ ఇటీవల అందర్నీ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. పూజా కార్యక్రమంలో భాగంగా ఓ టైటిల్‌గా సెట్ చేసినట్టు తెలుస్తోంది.
అయితే ఈ విషయాన్ని అధికారికంగా రివీల్ చేయాల్సి ఉంది. ప్రతిభావంతులైన MM కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ప్రస్తుతానికి ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపిక ఇంకా ఖరారు కాలేదు. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి మెగా అభిమానులు అంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి సినిమాకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ ను తెలుసుకునేందుకు తెగ ఎగ్జైట్ అవుతున్నారు.
గూగుల్ లో సెర్చ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఓవైపు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. మరోవైపు నటీనటుల ఎంపిక కూడా జరగుతోంది. ఈక్రమంలోనే ఓ అదిరిపోయే అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. Mega 156 సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Mobile Phone Effects: మొబైల్ ఫోన్ అతిగా వాడితే మగతనం మటాష్, లేటెస్ట్ సర్వేలో సంచలన విషయాలు
Related News
Chiranjeevi: చిరంజీవి మేడే గ్రీటింగ్స్.. చైల్డ్ లేబర్ పై వీడియో షేరింగ్
Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మే డే సందర్భంగా ప్రజలకు, అభిమానులకు, సినీ కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ యాడ్ వీడియోను పోస్ట్ చేశారు. బాలకార్మిక వ్యవస్థ అనే సామాజిక దురాచారాన్ని రూపుమాపడానికి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ వో) చేస్తున్న ప్రచారం కోసం ఈ ప్రకటనను చిత్రీకరించినట్లు ఎక్స్ (ట్విట్టర్)లో చిరంజీవి ఒక పోస్ట్ లో పేర్కొన్నారు. ‘చిన్నిచేతులు’ ప�