New Josh : సమంత ఏమాత్రం తగ్గడం లేదబ్బా..!
టాలీవుడ్ హీరోయిన్ సమంత నాగచైతన్యతో బ్రేకప్ చెప్పాక తనదైన స్టయిల్ లో లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. వరుసగా ట్రిప్స్ కు వెళ్లడం, బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేయడం,
- By Balu J Published Date - 11:51 AM, Mon - 8 November 21

టాలీవుడ్ హీరోయిన్ సమంత నాగచైతన్యతో బ్రేకప్ చెప్పాక తనదైన స్టయిల్ లో లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. వరుసగా ట్రిప్స్ కు వెళ్లడం, బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేయడం, స్నేహితులతో పార్టీలు చేసుకుంటూ బిజీబిజీగా గడుపుతోంది. చైతూతో విడిపోయినప్పట్నుంచీ తన దారిలో తాను ముందుకు సాగడానికి ప్రయత్నిస్తోంది. ‘విడాకులు చాలా బాధాకరమైన ప్రక్రియ’ అని సమంత ఒక స్టేట్ మెంట్ ఇచ్చింది. అయితే డివోర్స్ నుంచి బయడపడేందుకే సమంత టూర్స్ వేయడం, ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకోవడం, బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తూ కొత్త జీవితం గడుపుతోంది.
ఇటీవల, సమంతా ఓ! బేబీ దర్శకురాలు నందిని రెడ్డి, హైదరాబాద్‌లో కొంతమంది స్నేహితులతో కలిసి ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసింది. ఆ పార్టీలో బ్లూ అండ్ వైట్ కలర్ డ్రెస్సింగ్ లో మెరిసింది. అంతకుముందు దీపావళి సందర్భంగా సమంత తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి ఇచ్చిన పార్టీకి అటెండ్ అయ్యింది. వీరిద్దరూ కలిసి రామ్ చరణ్, ఉపాసనతో కలిసి ఆనందాలను పంచుకున్నారు. గత నెల సమంతా శిల్పాతో కలిసి చార్ ధామ్ యాత్రకు వెళ్లి, అదే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు కూడా వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత శతరూపన్, దర్శక ద్వయం హరి-హరీష్‌లతో రెండు కొత్త తమిళ-తెలుగు ద్విభాషా చిత్రాలకు సైన్ చేసింది.
Related News

Basketball League: బాస్కెట్ బాల్ ఫెడరేషన్ లీగ్లో టాలీవుడ్ నటుడు, ఇండియా నుంచి ఏకైక ఆటగాడు
ఈ చాంపియన్ లీగ్లో ఇండియా నుంచి పాల్గొన్న ఏకైక ఆటగాడు అరవింద్ కృష్ణ కావటం విశేషం.