Nawab : ముఖేష్ గుప్తా నటించిన ‘ది వరల్డ్ ఆఫ్ నవాబ్’ సినిమా ప్రేమికులకు కనువిందు చేయనుంది
రాబోయే చిత్రం ది వరల్డ్ ఆఫ్ నవాబ్ (The World of Nawab) సినిమాతో తనలోని అద్భుతమైన నటున సామర్థ్యాన్ని తెరపై ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు.
- By Hashtag U Published Date - 06:02 PM, Fri - 20 October 23

The World of Nawab : గెలుపు ఓటములు సహజం, మనం వెళ్లే దారిలో పూలుంటాయి, ముళ్లుంటాయి వాటిన్నంటి మన లక్ష్యం కోసం అస్త్రాలుగా మలుచుకోవాలి. చిత్రపరిశ్రమలో, అది బాలీవుడ్ లో రాణించడం అంటే మాములు విషయం కాదు. ఎంతో మంది ఔత్సాహిక నటులకు తమ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. కానీ, సంకల్ప బలం ఉంటే కచ్చితంగా గెలిచే మార్గాలు ఉంటాయి అని నటుడు, నిర్మాత, రియల్ ఎస్టేట్ అనుభవజ్ఞుడైన ముఖేష్ గుప్తా పేర్కొన్నారు. ఎప్పుడు కష్టాలకు ఎదురెళ్లి, సమస్యలను పరిష్కరించే జీవనవిధానాన్ని ఇష్టపడే ముఖేష్ గుప్తా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. రాబోయే చిత్రం ది వరల్డ్ ఆఫ్ నవాబ్ (The World of Nawab) సినిమాతో తనలోని అద్భుతమైన నటున సామర్థ్యాన్ని తెరపై ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
నవాబ్ ఒక అసాధరణమైన మలుపులతో, ప్రేక్షకుడిని ఆద్యాంతం ఉక్కిరిబిక్కిరి చేసే సినిమా. ఈ చిత్రంలో ట్విస్ట్ లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇది వరకే రిలీజైన నవాబ్ పోస్టర్లో ముఖేష్ గుప్తా బాడీ లాంగ్వేజ్ కాస్త రివీల్ అయింది. ఆయన శరీరాకృతి, ఆకట్టుకునే వ్యక్తిత్వంతో అంతే కాకుండా హీరోగా కెమెరాతో కుదిరిగిన కెమిస్ట్రీకి ములంగానే అతని పాత్ర అంత చక్కగా తెరకెక్కించడానికి వీలుపడిందని మేకర్స్ తెలిపారు. ముఖేష్ గుప్తా ఇండస్ట్రీకి వచ్చి రెండేళ్లు మాత్రమే అయిందని, నటనపై ఆయనకు ఉన్న మక్కువతో మంచి సినిమా అందిస్తున్నట్లు తెలిపారు. ఇక రాహుల్ దేవ్, మురళీ శర్మ వంటి సీనియర్ నటులతో ప్రధాన పాత్రలో ముఖేష్ గుప్తా అక్కీ భాయ్‌గా కనిపించనున్నారు.
మీడియా కథనాల ప్రకారం నవాబ్ చిత్రం ఇప్పటికే 95 శాతం పూర్తి అయింది. ఇక 2024లో పాన్ ఇండియాగా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకు రంగం సిద్దం అవుతుంది. సినిమా విజయం పట్ల ముఖేష్ గట్టి నమ్మకంతో ఉన్నారు. నటుడిగా ఇండస్ట్రికి రాకముందు సినిమా బఫ్‌గా ఉండేవాడినని, దాంతో సినిమా ప్రేమికుడికి ఏం కావాలో తెలుసని తెలిపారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే రవి చరణ్ దర్శకత్వంలో ఆర్‌ఎమ్ నిర్మాణసారథ్యంలో ది వరల్డ్ ఆఫ్ నవాబ్ (The World of Nawab) తెరకెక్కిందని వెల్లడించారు. మంచి వినోదాన్ని ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారని దీనితో పాటు ఆకట్టుకునే కథనే చిత్రం విజయం అవడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని ముఖేష్ గుప్తా అన్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాను చూసే విధానం మారిందని, ఆసక్తికరమైన కథతో పాటు, భావోద్వేగలతో కూడిన కథను ఎక్కువగా ఇష్టపడుతున్నారని, ఇలాంటి అంశాలే నవాబ్ చిత్రానికి పిల్లర్స్ అని ముఖేష్ గుప్తా చెప్పారు.
అంతే కాదు కథకు జీవం పోయాలంటే భావోధ్వేగాలను పండించే ఆర్టిస్టులు ఎందో అవసరం అని, ప్రేక్షకులు సినిమాలోకంలో విహరించాలంటే బలమైన తారాగణం కూడా సహాయపడుతుందని, ది వరల్డ్ ఆఫ్ నవాబ్ (The World of Nawab) సినిమాలో ఇలాంటి అన్ని అంశాలు చాలా విస్తృతంగా ఉన్నాయని, కచ్చితంగా నవాబ్ చిత్రం ప్రేక్షకులకు విందు భోజనం అందిస్తుందని తెలిపారు. ముఖేష్ గుప్తా సరసన మల్లేశం, వకీల్ సాబ్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న బ్యూటీ అనన్య నాగళ్ల నటిస్తోంది. అయితే తక్కువ సమయంలో సాధించడం సవాలుగానే ఉంటుంది, కానీ సరైన ఆలోచనా విధానం ఉంటే దేన్నైనా ఖచ్చితంగా సాధించవచ్చని ముఖేష్ గుప్తా అన్నారు. గత రెండేళ్లలో ముఖేష్ గుప్తా మంచి ప్రాజెక్ట్ లనే చేశారు. నుష్రత్ భారుచా నటించిన “జన్హిత్ మే జారీ” చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంతో సంజయ్‌కు లైఫ్ టర్న్ అయింది. ఆ తరువాత అతను వెనుదిరిగి చూడలేదు. అలాగే జీ మ్యూజిక్ కోసం “రోయేగీ తు సరి సారీ రాత్” అనే మ్యూజిక్ వీడియోలో నటించాడు. ఇది ముఖేష్ గుప్తాకు మంచి పేరును తీసుకొచ్చింది. ఇలా తాను చేసే వినుత్నమైన కార్యక్రమాలు కొత్త దర్శకులను ఆకర్షించాయి. అందుకే ఎన్నో ప్రాజెక్ట్ లు తనను వెతుక్కుంటూ వస్తున్నాయి. వచ్చే ఏడాది నవాబ్ చిత్రం విడుదల కానుండగా తాజాగా మరో రెండు ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ముఖేష్ గుప్తా.
నటీనటులు: ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల, మురళి శర్మ, దేవిప్రసాద్, శివపుత్రుడు రామరాజు, రాహుల్ దేవ్, శ్రవాణ్ రాఘవేంద్ర, పాయల్ ముఖర్జీ, స్నేహా గుప్త, రావి పల్లి సంధ్యరాణి, ప్రియా, శరత్ బరిగెల, సాగర్ ఎనుగల, మల్లేడి రవి, అరున్ కుమార్, సంజయ్ రాయుచురి, శ్రీ సుధా, కృష్ణేశ్వర రావు, టార్జాన్, కోటేశ్వరరావు, డబ్బింగ్ జానకి, మని భమ్మ, సమ్మెట గాంధీ, మేక రామకృష్ణ, సునీత మనోహర్, పింగ్ పాంగ్ సూర్య, జెమిని సురేష్, దయానంద రెడ్డి, అప్పాజీ, దీపక్ సూర్య, యోగి కాత్రి తదితరులు.
బ్యానర్: హరిహర క్రియేషన్స్
రచనా దర్శకత్వం: రవి చరణ్
నిర్మాత: ఆర్ ఎమ్
మ్యూజిక్ డైరెక్టర్: పీఆర్
సినిమాటోగ్రఫర్: రమేష్ కేఆర్
ఎడిటర్: శివ సర్వని
కొరియోగ్రఫర్: ప్రేమ్ రక్షిత్
వీఎఫ్ఎక్స్: రాఘవ
స్టంట్స్: నవకాంత్
స్టైలిస్ట్: శోభారాణి
పీఆర్ఓ: హరీష్, దినేష్
Also Read: Bhagavanth Kesari: భగవంత్ కేసరి.. కలెక్షన్ల సునామీ, మొదటి రోజు ఎంతవసూలు చేసిందంటే