Puri Jagannadh Curse: పూరిని వెంటాడుతున్న ‘శాపం’.. ఆ డ్రీమ్ ప్రాజెక్టుకు బ్రేక్!
లైగర్ ఫెయిల్యూర్ తో టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కెరీర్ డైలమాలో పడింది.
- Author : Balu J
Date : 05-09-2022 - 2:12 IST
Published By : Hashtagu Telugu Desk
లైగర్ ఫెయిల్యూర్ తో టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కెరీర్ డైలమాలో పడింది. లైగర్ సక్సెస్ అయ్యి ఉంటే, మళ్లీ విజయ్ దేవరకొండతో కలిసి జన గణ మన (JGM) సినిమాను ప్రారంభించే అవకాశాలు ఉండేవి. అయితే తాజా రిపోర్ట్స్ ప్రకారం ఆ సినిమాకు బ్రేక్ పడింది. కొన్ని సంవత్సరాల క్రితమే పూరి మహేష్ బాబుతో JGM చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించాడు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. ఆ తర్వాత కూడా, పూరి జగన్నాధ్ కెరీర్ గందరగోళంలో పడింది.
ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. లైగర్ తర్వాత పూరి ఏం చేస్తాడనేది అంతటా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం పూరి చేతిలో ప్రాజెక్ట్‌లు లేవు. పూరీ జగన్నాధ్ కెరీర్ కు జనగణమన శాపం అని సోషల్ మీడియాలో నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ పూరి మాత్రం జన గణమనను తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావించి భవిష్యత్తులో స్టార్ హీరోతో తీయాలనే పట్టుదలతో ఉన్నాడు.