#Thandel First Glimpse : తండేల్ నుండి ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది..
- By Sudheer Published Date - 04:26 PM, Sat - 6 January 24
వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)..ప్రస్తుతం ఆశలన్నీ తన 23 (#NC23 Thandel ) వ చిత్రం పైనే పెట్టుకున్నాడు. సవ్యసాచి , ప్రేమమ్ చిత్రాల డైరెక్టర్ చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్షన్లో మరోసారి చైతు నటిస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో #NC23 గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తుంది. 2018లో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తాలూకా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు.
గ్లింప్స్ లో నాగ చైతన్య మాస్ లుక్ లో కనిపించాడు. దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ గా ఉండబోతుందని అర్ధం అవుతుంది. పక్కా ఉత్తరాంద్ర యాసలో రాసిన డైలాగ్స్ సినిమాకు అదనపు ఆకర్షణ గా ఉండనున్నాయి. ఇండియా, పాకిస్తాన్ మధ్యలో జరిగే ఫైట్ గానే మూవీలో బలమైన ఎలిమెంట్ ని ఆవిష్కరిస్తున్నారు. ఇక నాగచైతన్య పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చే సీన్ కూడా చాలా హైలెట్ గా ఉంది. జాతియా జెండాను తాకుతూ.. మా నుంచి విడిపోయిన ఒక ముక్క పాకిస్తాన్.. మీకే అంత ఉంటే.. ఆ ముక్కను ముష్టి వేసిన మాకెంత ఉండాలి అని చైతు పవర్ఫుల్ డైలాగ్ తో అదరగొట్టాడు. గ్లింప్స్ చివరిలో బుజ్జితల్లి నేనొచ్చేత్తానే అనే డైలాగ్ చైతూ చెబుతుంటే సాయి పల్లవి క్యారెక్టర్ ని రివీల్ చేశారు. ఆమె పాత్ర కూడా మూవీలో చాలా ఇంటరెస్టింగ్ గా ఉండబోతోందని అర్ధం అవుతుంది. ఓవరాల్ గా గ్లింప్స్ చూస్తే పక్క లవ్ & కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమా ఉండనుందని తెలుస్తుంది.