Thalapathi Vijay : లియో తెలుగు బిజినెస్.. మైండ్ బ్లాక్..!
Thalapathi Vijay దళపతి విజయ్ సినిమా అంటే కోలీవుడ్ ఆడియన్స్ కి పండుగ అన్నట్టే లెక్క. రజిని తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్
- By Ramesh Published Date - 01:49 PM, Thu - 5 October 23

Thalapathi Vijay దళపతి విజయ్ సినిమా అంటే కోలీవుడ్ ఆడియన్స్ కి పండుగ అన్నట్టే లెక్క. రజిని తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా దళపతి విజయ్ క్రేజ్ తెచ్చుకున్నారు. అందుకే ఆయన సినిమాలన్నీ కూడా అక్కడ వరుస సక్సెస్ లతో అదరగొట్టేస్తున్నాయి. విజయ్ సినిమా ప్రతి ఒక్కటి తెలుగులో రిలీజ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాలకు వచ్చి ప్రమోట్ చేయకపోయినా సరే విజయ్ సినిమాలకు ఇక్కడ బాగానే డిమాండ్ ఉంటుంది.
దిల్ రాజు బ్యానర్ లో విజయ్ (Thalapathi Vijay ) నటించిన వారిసు తెలుగు వెర్షన్ వారసుడు రిలీజ్ కి కూడా ఆయన రాలేదు. ఇదిలాఉంటే లేటెస్ట్ గా విజయ్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా లియో అక్టోబర్ 19న రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. విక్రం తర్వాత లోకేష్ సినిమాల మీద నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ లోకేష్ కలిసి చేస్తున్న లియో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి.
Also Read : NTR Devara : దేవర రెండు భాగాలు.. అలా చెప్పుంటే లెక్క వేరేలా ఉండేది..?
అందుకు తగినట్టుగానే ఈ సినిమా బిజినెస్ జరుగిగిందని తెలుస్తుంది. తమిళ వెర్షన్ 100 కోట్లు ఓవర్సీస్ 65 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా మరో 20 కోట్లు కాగా తెలుగు వెర్షన్ 22 కోట్ల దాకా బిజినెస్ జరిగందని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లియో సినిమా రైట్స్ కొన్నారు. టోటల్ గా లియో 230 కోట్ల వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ తో వస్తుంది. దసరాకి సినిమాల పండుగ షురూ కాగా ఈ విజయ దశమికి బాలయ్య భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వర రావు రేసులో ఉన్నాయి.
ఈ రెండు సినిమాలకు ధీటుగా విజయ్ లియో రిలీజ్ కాబోతుంది. లియో ప్రమోషన్స్ కైనా విజయ్ (Vijay) తెలుగు రాష్ట్రాలకు వస్తాడా లేదా అన్నది చూడాలి. తెలుగులో తుపాకి రిలీజ్ టైం లో ప్రమోషన్స్ కి హైదరాబాద్ వచ్చిన విజయ్ ఆ తర్వాత ఏ సినిమాకు రాలేదు. మరి ఇంత పెద్ద మొత్తం లో బిజినెస్ చేశాక కూడా విజయ్ ని ప్రమోషన్స్ కి తీసుకు రాలేకపోతే మాత్రం ఆ ఎఫెక్ట్ సినిమా మీద పడే ఛాన్స్ ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join