HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Telugu Indian Idol Finale Winnter Bvk Vagdevi

Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా వాగ్దేవి!

సంగీత సమరం ముగిసింది. ఎప్పటి నుండో మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ ఎవరవుతారు అన్న ప్రశ్నకు సమాధానం దొరికే రోజు వచ్చింది.

  • Author : Balu J Date : 18-06-2022 - 4:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telugu Idol
Telugu Idol

సంగీత సమరం ముగిసింది. ఎప్పటి నుండో మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ ఎవరవుతారు అన్న ప్రశ్నకు సమాధానం దొరికే రోజు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా వాగ్దేవి ట్రోఫీ ని అందుకొని మొట్ట మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ గా ఒక చరిత్ర రాసింది. 15 వారల సుదీర్ఘ సంగీత ప్రయాణం తర్వాత ఆహా ఈ 17 జూన్ నాడు ఫినాలే టెలికాస్ట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి తో పాటు, రానా దగ్గుబాటి మరియు సాయి పల్లవి కూడా విచ్చేసి గ్రాండ్ ఫినాలే ను కన్నుల పండుగగా మార్చేశారు.

తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ వాగ్దేవి కి ట్రోఫీ తో పాటు 10 లక్షల బహుమానం మరియు గీత ఆర్ట్స్ నుండి రానున్న సినిమాలో పాడే అవకాశం కూడా వచ్చింది. మొదటి రన్నరప్ శ్రీనివాస్ కు 3 లక్షలు, రెండో రన్నరప్ వైష్ణవి కి 2 లక్షల బహుమానం ఇవ్వడం జరిగింది. చిరంజీవి గారు వైష్ణవి పాటకు మంత్రముగ్ధులయ్యి, తన తర్వాత సినిమా గాడ్ ఫాదర్ లో పాడే అవకాశం ఇచ్చారు. ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షో తెలుగు లో మొట్ట మొదటి సారిగా ఆహా తీసుకురావడం జరిగింది. ఈ షో కి యాంకర్ గా శ్రీరామ చంద్ర నిర్వహించంగా, న్యాయనిర్ణేతలుగా తమన్, నిత్య మీనన్, మరియు కార్తీక్ ఈ షో ని తమ భుజాల మీద వేసుకొని ముందుకు నడిపారు. ఈ షో విన్నర్ వాగ్దేవి మాట్లాడుతూ, “ఎంతో సంతోషంగా ఉంది. నేను టైటిల్ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఎంతో మంది దిగ్గజాల ముందు నేను పాడాను. ఈరోజు చిరంజీవి గారి చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి నుండి ఎన్నో జ్ఞాపకాలతో పాటు సంగీత జ్ఞానాన్ని కూడా నేను తీసుకొని వెళుతున్నాను. అందుకు నేను తెలుగు ఇండియన్ ఐడల్ మరియు ఆహా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను”

ఆహా సీఈఓ అజిత్ కె ఠాకూర్ మాట్లాడుతూ, “ఆహా ఎప్పుడూ అందరిని అలరించాలని, తెలుగు వారి ప్రతిభను ప్రపంచానికి చూపించడానికి అహర్నిశలు తోడ్పడుతుంది. తెలుగు ఇండియన్ ఐడల్ అలా వచ్చిన ఒక అలోచన ఇవ్వాళ ప్రభంజనంలా మారి వాగ్దేవి, వైష్ణవి లాంటి యువ గాయనీమణులకు ఒక సరికొత్త జీవితానికి నాంది పలికింది. ఇన్ని రోజులు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు, వాగ్దేవి కి అభినందనలు. ” విన్నర్ వాగ్దేవి కి చందన బ్రదర్స్ వారు 3 లక్షలు, తెనాలి డబల్ హార్స్ 3 లక్షలు బహుకరించారు. రన్నరప్ శ్రీనివాస్ కు తెనాలి డబల్ హార్స్ 2 లక్షలు బహుకరించంగా, చందన బ్రదర్స్ వారు రన్నరప్ వైష్ణవి కి 1లక్ష ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • Indian Idol
  • telugu
  • winner

Related News

Mana Shankara Varaprasad Garu

ఓటిటిలో సందడి చేసేందుకు సిద్దమైన ‘వరప్రసాద్’.. స్ట్రీమింగ్ ఆరోజు నుండే !!

బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్ తోడవ్వడంతో ఈ చిత్రం కేవలం కొద్ది రోజుల్లోనే రూ. 360 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది

    Latest News

    • టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్‌.. రేపట్నుంచి సంద‌డే!

    • ఏపీలో మారుతి సుజుకీ ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్స్

    • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

    • షెకావత్ ను దింపుతున్న అనిల్ రావిపూడి ?

    • ఇక యాటిట్యూడ్ స్టార్ పని అయిపోయినట్లే..ఎందుకంటే అసలైన లేడీ టైగర్ దిగింది !!

    Trending News

      • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

      • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

      • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

      • రోజ్ డే పూలను ఎలా భద్రపరుచుకోవాలి?

      • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd