Teja Sajja Mirai First Glimpse : తేజా సజ్జా మిరాయ్ గ్లింప్స్.. మాటల్లేవ్ అంతే..!
Teja Sajja Miray First Glimpse చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించి హీరోగా మారి ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు తేజా సజ్జ. ఈ ఇయర్ మొదట్లో హనుమాన్ తో అతను చేసిన హంగామా
- By Ramesh Published Date - 02:51 PM, Thu - 18 April 24

Teja Sajja Miray First Glimpse చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించి హీరోగా మారి ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు తేజా సజ్జ. ఈ ఇయర్ మొదట్లో హనుమాన్ తో అతను చేసిన హంగామా తెలిసిందే. హనుమాన్ తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తేజా సజ్జ తన నెక్స్ట్ సినిమాను కూడా అదే రేంజ్ లో చేస్తున్నాడు.
కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో మిరాయ్ అంటూ ఒక అద్భుతమైన కథతో అంతకుమించిన విజువల్ వండర్ తో వస్తున్నాడు తేజా సజ్జ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మిరాయ్ నుంచి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ చూసిన వారెవరైనా వావ్ అనేయక తప్పదు.
కథల సెలక్షన్స్ లో తేజా సజ్జా ఇంప్రెస్ చేస్తున్నాడు. ఈసారి అశోకుడి కాలం నాటి యోధుడి గ్రంధం గురిచి మిరాయ్ లో చెప్పబోతున్నాడు. మిరాయ్ ఫస్ట్ గ్లింప్స్ తోనే వారెవా అనిపించేలా చేశాడు. తేజా సజ్జ కి తప్పకుండా ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read : Vijay Devarakonda : దేవరకొండ మారిపోతున్నాడా.. ఫ్యాన్స్ కి కిక్కే కిక్కు..!
ఈగల్ సినిమా పెద్దగా వర్క్ అవుట్ కాకపోయినా కార్తీక్ ఘట్టమనేనితో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేస్తున్న ఈ క్రేజీ అటెంప్ట్ కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో బీభత్సం సృష్టించేలా ఉంది.
తన స్టోరీ సెలక్షన్ దానికి తను పెట్టే ఎఫర్ట్స్ తో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాడు తేజా సజ్జ. కష్టే ఫలి అన్న ఫార్ములాను తూచా తప్పకుండా పాటిస్తూ తెలుగులో మరో ధృవతారగా ఎదిగేందుకు కృషి చేస్తున్నాడు.