HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Tamil Hero Vikram Says Im Crazy About Acting Try Something New

Chiyaan Vikram: నాకు నటన అంటే పిచ్చి.. కొత్తగా చేయడానికే ప్రయత్నిస్తా!

చియాన్ విక్రమ్ కధానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు

  • By Balu J Published Date - 11:15 AM, Mon - 29 August 22
  • daily-hunt
Vikram
Vikram

చియాన్ విక్రమ్ కధానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌ పై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది. తాజాగా ‘కోబ్రా” చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది. విక్రమ్, శ్రీనిధి, మీనాక్షి, మృణాళిని రవి, నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ ప్రెస్ మీట్ లో పాల్గొని చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకులతో నాకు గొప్ప అనుబంధం వుంది. నేను నటనకు ఆస్కారం వుండే పాత్రలు, సినిమాలు చేసినప్పుడల్లా గొప్పగా ఆదరిస్తారు. కోబ్రాలో కూడా అద్భుతమైన ఫెర్ ఫార్మెన్స్ వుంటుంది. కోబ్రా కథ నాకు చాలా నచ్చింది. కథ విన్న వెంటనే సినిమా చేసేయాలనిపించింది. సినిమా మొదలుపెట్టిన తర్వాత కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. అయితే అవన్నీ దాటుకుంటూ సినిమాని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించాం. రష్యాలో మైనస్ డిగ్రీలలో చిత్రీకరీంచినపుడు సహాయ దర్శకులు రక్తం కూడా వచ్చింది. చాలా కష్టపడి చేశాం. ఒకొక్క పాత్రకి మేకప్ వేయడానికి సుమారు ఐదు గంటల సమయం పట్టేది. అయితే దిన్ని ఎంజాయ్ చేశాను. ప్రతి పాత్రకి ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, మేనరిజం ఆలోచిస్తున్నపుడు చాలా ఆనందంగా వుండేది. కోబ్రా సైకాలాజికల్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, ఎమోషనల్ డ్రామా, హై ఆక్టేవ్ యాక్షన్. టెక్నికల్ గా వున్నంతంగా వున్న సినిమా ఇది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ శ్రీనిధి,. మీనాక్షి , మృణాళిని. చక్కగా తెలుగులో మాట్లాడారు. కొబ్రాలో శ్రీనిధి, నాకు మంచి రొమాంటిక్ బాండింగ్ వుంటుంది. దర్శకుడు అజయ్ చాలా కొత్తగా డిజైన్ చేశారు. మీనాక్షి కాలేజీ అమ్మాయిగా కనిపిస్తుంది. మృణాళిని పాత్ర ఎమోషనల్ గా వుంటుంది. కోబ్రా బయటికి ఒక హాలీవుడ్ మూవీలా కనిపిస్తున్నా లోపల ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ ఇలా చాలా ఎలిమెంట్స్ వున్నాయి. రోషన్ అండ్రూ విలన్ గా కనిపిస్తారు. ఇర్ఫాన్ పఠాన్ మొదటి సినిమా ఇది. ఆయనసెట్స్ కి వచ్చినపుడు నటన గురించి పెద్దగా తెలీదు. కానీ దర్శకుడు అజయ్ ట్రైన్ చేసి ఒక ప్రొఫెషనల్ నటుడిగా తీర్చిదిద్దారు.ప్రేక్షకులకు మంచి ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. కోబ్రా ఒక యూనివర్సల్ సబ్జెక్ట్. ఇంత మంచి సినిమాని తెలుగులో తిరుపతి ప్రసాద్ గారు విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన వుంటే ఒక ధైర్యం. కోబ్రా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. కోబ్రాని తెలుగు ప్రేక్షకులతో పాటు థియేటర్లో కలసి చూస్తా” అన్నారు.

ఎన్వీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ.. కమల్ హసన్ గారి తర్వాత నటన విశ్వరూపం చూపించే నటుడు విక్రమ్. విభిన్నమైన పాత్రలలో విభిన్నమైన గెటప్స్ లో అలరించడం విక్రమ్ గారి లాంటి కొద్దిమంది నటులకే సాధ్యపడుతుంది. శివపుత్రుడు, అపరిచితుడు, ఐ చిత్రాలలో విక్రమ్ తన నట విశ్వరూపం చూపించారు. కోబ్రా కూడా భారీ స్థాయి సినిమా. ఈ సినిమా కోసం రష్యాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇవ్వాలని, మైనస్ డిగ్రీల వద్ద కూడా చిత్రీకరణ జరిపి మైండ్ బ్లోయింగ్ సన్నివేశాలు తీశారు. కోబ్రా ప్రేక్షకులకు కన్నుల పండుగగా ఉండబోతుంది. దర్శకుడు అజయ్, ఏఆర్ రెహ్మాన్ లాంటి అత్యున్నత సాంకేతక నిపుణులు ఈ సినిమా కోసం పని చేశారు. రష్యాతో పాటు కలకత్తా, చెన్నై, అలిపి ఇలా విభిన్నమైన ప్రాంతాల్లో ఈ సినిమాని చిత్రీకరించారు. ప్రేక్షకులు మంచి సినిమాని అందించాలానే ఉద్దేశంతో చిత్ర యూనిట్ అహర్నిశలు కష్టపడి చేసింది. టీం ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ కోబ్రాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం మరో విశేషం. నిర్మాత లలిత్ , దర్శకుడు అజయ్ మిగతా యూనిట్ అంతటి ఆల్ ది బెస్ట్. విక్రమ్ గారి సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ఆగస్ట్ 31న కోబ్రా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా విక్రమ్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది” అని అన్నారు.

శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. కోబ్రా మూవీని తెలుగు విడుదల చేస్తున్న ఎన్వీఆర్ మూవీస్ కి థాంక్స్. విక్రమ్ గారి తో నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత దర్శకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది. కోబ్రా థియేటర్ ఎక్స్ పిరియన్స్ చేయాలి. దయచేసిన అందరూ థియేటర్ కి వెళ్లి ఎంజాయ్ చేయండి” అన్నారు.

మృణాళిని మాట్లాడుతూ.. విక్రమ్, అజయ్ గారికి థాంక్స్. ఇందులో ఇంటెన్స్, ఎమోషనల్ రోల్ లో కనిపిస్తా. నాపై నమ్మకంతో ఈ పాత్ర ఇచ్చిన దర్శకుడు అజయ్ గారి థాంక్స్. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. విక్రమ్ గారి నుండి చాలా నేర్చుకున్నాను. అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేశారు. ఆగస్ట్ 31 అందరూ థియేటర్లో సినిమా చూడాలని కోరుకుంటున్నాను.

అనంతరం మీడియా ప్రతినిధిలు అడిగిన ప్రశ్నలకు కోబ్రా చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చింది .

కోబ్రాలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి ?

విక్రమ్ : నిజంగా కోబ్రాలో ఇన్ని పాత్రలు గురించి మొదట ఆలోచన లేదు. ఒక్కసారి చూసుకునే సరికి తొమ్మిది విభిన్నమైన పాత్రలు వచ్చాయి. కోబ్రా చాలా ఇంటరెస్టింగ్ కథ. గణితం చాలా మందికి కష్టమైన సబ్జెక్ట్. అలాంటి గణితంని వాడి ఎలాంటి అడ్వెంచర్స్ చేశారనేది ఇందులో బ్రిలియంట్ గా వుంటుంది. నాకు లెక్కలు సరిగ్గా రావు. కానీ ఇందులో లెక్కల మాస్టారిగా చేశాను. (నవ్వుతూ). కథ చాలా ఎక్సయిటింగా వుంటుంది. కథలో చాలా లేయర్లు వున్నాయి. దర్శకుడు అజయ్ అద్భుతంగా డీల్ చేశారు.

కోబ్రా అని టైటిల్ పెట్టారు.. ఇంతకీ కథానాయకుడు విలనా ? హీరోనా ?

విక్రమ్: కోబ్రా ఎప్పుడు కాటేస్తుందో తెలీదు, అలాగే కోబ్రా తన చర్మాన్ని మార్చుకోగలదు. ఇందులో నా పాత్ర అలానే వుంటుంది. ప్రతి పాత్రలో విభిన్నమైన ఫెర్ఫార్మెన్స్ వుంటుంది. డబ్బింగ్ లో కూడా చాలా వేరియేషన్స్ వున్నాయి. నా కెరీర్ లో చాలా సవాల్ గా అనిపించిన సినిమా కోబ్రా.

అపరిచితుడులో గొప్ప సందేశం వుంటుంది. కోబ్రాలో అలాంటి సందేశం ఏమైనా ఇస్తున్నారా ?

విక్రమ్ : కోబ్రాలో సందేశం వుండదు కానీ లవ్, ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషనల్ డ్రామా వుంటుంది. దానికి ప్రేక్షకులు చాలా గొప్పగా కనెక్ట్ అవుతారు.

ఇంతకష్టమైన పాత్రలు చేయడానికి స్ఫూర్తి ఎక్కడి నుండి వస్తుంది ?

విక్రమ్: నాకు నటన అంటే పిచ్చి. ఏదైనా భిన్నంగా చేయడానికే ప్రయత్నిస్తా. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్త అనుభూతిని పంచాలనేదే నా ప్రయత్నం.

ఇందులో నటించడానికి ప్రధాన కారణం ?

శ్రీనిధి : విక్రమ్ గారు వున్నారు. అజయ్ గారు గత చిత్రం నాకు చాలా నచ్చింది. రెహ్మాన్ గారి మ్యూజిక్. ఇంతమంచి టీంతో కలసి పని చేసే అవకాశం రావడమే గొప్ప విషయం.

విక్రమ్, యష్ లలో మీరు గమనించిన గొప్ప క్యాలిటీ ?

శ్రీనిధి: ఇద్దరూ నటన పట్ల అంకిత భావంతో వుంటారు. విక్రమ్ ఇన్నేళ్ళుగా పని చేస్తున్నా.,. సెట్స్ లో చాలా హంబుల్ గా వుంటారు.

పెర్ ఫార్మెన్స్, గెటప్ వేరియేషన్స్ వున్న సినిమాల వైపు ఎక్కువ మొగ్గు చూపడానికి కారణం ?

విక్రమ్: ప్రభుదేవాని ఎందుకు డ్యాన్స్ చేస్తున్నాడని అని అడిగితే ఏం చెప్తాం. నాకు తెలిసిందే ఇదే. దాన్ని చేయడంలోనే ఆనందం పొందుతాను. ఇప్పటికీ తమిళ్ లో టాప్ హీరోల్లో నేనూ ఒకడ్ని. హిట్స్ వచ్చాయా లేదా అనేది కాదు.. ప్రేక్షకుకులు నన్ను ప్రేమిస్తున్నారు. ప్రేక్షకులు నా నుండి ఇలాంటి పాత్రలు, సినిమాలు కోరుకుంటారు. వాళ్ళు కోరుకునేదే చేస్తున్నాను.

ఏ హీరోలతో పని చేయాలనీ వుంది ?

శ్రీనిధి : అన్ని సినిమాలు, అందరి హీరోలతో కలసి పని చేయాలనీ వుంది.

దర్శకుడు అజయ్ లో మీరు గమనించిన బెస్ట్ క్యాలిటీ ?

అవుట్ అఫ్ ది బాక్స్ ఆలోచిస్తారు. చాలా కమిట్ మెంట్ తో పని చేస్తారు. ఆయన చాలా స్మార్ట్.

విక్రమ్ సెట్స్ లో ఎలా వుంటారు ?

శ్రీనిధి : చాలా సరదాగా వుంటారు. చాలా ఫ్రాంక్ లు చేస్తారు.

మృణాళిని: విక్రమ్ గారితో షూటింగ్ అంటే సెట్ లోచాలా సీరియస్ గా ఉంటారని అనుకున్నాను. కానీ ఆయన మాత్రం గేమ్స్ ఆడుకుంటూ ఫ్రాంకులు చేస్తూ సరదాగా కనిపించారు. నా భయం అంతా పోయింది.

మీనాక్షి : విక్రమ్ గారు గ్రేట్ యాక్టర్. ఆయన సెట్స్ లో వుంటే గొప్ప ఎనర్జీ వుంటుంది. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయలేం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cobra
  • latest tollywood news
  • special
  • vikram

Related News

    Latest News

    • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

    • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

    Trending News

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd