Suriya 42: సూర్య ‘పీరియాడిక్ యాక్షన్ 3D’ చిత్రం.. సరికొత్త అవతార్ లో అదుర్స్!
డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరు తమిళ్ హీరో సూర్య. తదుపరి చిత్రం కోసం దర్శకుడు సిరుత్తై శివతో పనిచేయనున్నారు.
- By Balu J Published Date - 02:00 PM, Fri - 9 September 22
డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరు తమిళ్ హీరో సూర్య. తదుపరి చిత్రం కోసం దర్శకుడు సిరుత్తై శివతో పనిచేయనున్నారు. వర్కింగ్ టైటిల్ గా ‘సూర్య 42’ అని పేరు పెట్టారు. గ్రాండ్ లాంచ్ తర్వాత, ఈ రోజు చిత్రం మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ అందరిన్నీ ఆకట్టుకుంటున్నాయి. తన భుజంపై డేగతో యోధుడి అవతార్‌లో కనిపిస్తాడు. ‘సూర్య 42’ ఒక పీరియాడిక్ ఫిల్మ్ అని తెలుస్తోంది. ఇది నిజమైతే సూర్యను అటువంటి జానర్లో చూడటం ప్రేక్షకులకు కచ్చితంగా విజువల్ ట్రీట్ అవుతుంది. ఈ చిత్రాన్ని 3డి చిత్రంగా 10 భాషల్లో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. గతంలో ఎన్నడూ చూడని అవతార్ లో సూర్యను చూడొచ్చు.
“ది ప్రెస్టీజియస్ మెగా ప్రాజెక్ట్”గా రానున్న సూర్య నటిస్తున్న ఈ చిత్రంలో దిశా పటాని మహిళా ప్రధాన పాత్రలో కనిపించనుంది. యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనంద్ రాహ్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. సూర్య 42 భారీ ఎత్తున నిర్మించబడుతుంది. 10 విభిన్న భాషలలో విడుదల కానుంది. యువి క్రియేషన్స్ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొదటి షెడ్యూల్ చెన్నైలో జరిగింది. సెప్టెంబర్ 13 నుండి మరో షెడ్యూల్ గోవాలో ప్రారంభమవుతుంది. దర్శకుడు ఒక గ్రాండ్ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ప్లాన్ చేసాడు. ఇందులో దాదాపు 250 మంది బౌన్సర్లు పాల్గొంటారు.
Related News
Virat Kohli: వైరల్ అవుతున్న కోహ్లీ లుక్, ఐపీఎల్ కోసం ఇండియాకి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చాడు. త్వరలో జరగనున్న ఐపీఎల్ టోర్నీ కోసం విరాట్ బెంగళూరు జట్టులో చేరనున్నాడు.