పవన్ కు వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్ను ధర ఎంతో తెలుసా..?
పవన్ కళ్యాణ్ కు ఎంతో ఇష్టమైన అపురూపమైన కానుక అందించి ఆనంద పరిచారు
- Author : Sudheer
Date : 16-06-2024 - 11:22 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan )కు వదిన సురేఖ (Surekha), పవన్ కళ్యాణ్ కు ఎంతో ఇష్టమైన అపురూపమైన కానుక అందించి ఆనంద పరిచారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చిరంజీవిని కలిసేందుకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్బంగా మరిదిని ఆశీర్వదించిన కొణిదెల సురేఖ.. అత్యంత ఖరీదైన మోంట్ బ్లాంక్ వాల్ట్ డిస్నీ పెన్నును పవన్ కళ్యాణ్‌కు గిఫ్టుగా ఇచ్చారు.
గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో మెగా ఫ్యామిలి వీడియో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోస్ బంధాలకు, అనుబంధాలకు అర్థం చెబుతున్నాయి. మెగా ఫ్యామిలీ కుటుంబం అంటే ఇలా ఉండాలని అన్నదమ్ముల మధ్య ప్రేమ ఇలా ఉండాలని, కుటుంబ సభ్యులందరూ ఇలా కలిసిమెలిసి ముందుకు సాగాలని అర్థమయ్యేలా చెపుతున్నాయి. గత పదేళ్లుగా పవన్ కళ్యాణ్ పడుతున్న కష్టానికి ప్రతిఫలం దక్కింది. పిఠాపురం నుండి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్..ఘన విజయం సాధించడమే కాదు తన పార్టీ నుండి బరిలోకి దింపిన 21 మంది ఎమ్మెల్యేలు , 2 పార్లమెంట్ అభ్యర్థులు విజయం సాధించి అద్భుత విజయం సాధించారు. ఈ విజయం తో అభిమానులు , పార్టీ శ్రేణులే కాదు మెగా ఫ్యామిలి కూడా ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా మెగా ఫ్యామిలీ అంతా తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ “కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను” అంటూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఘట్టాన్ని చూసిన మెగా ఫ్యామిలీ అంతా పులకించిపోయింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ మరిది పవన్ కళ్యాణ్ సాధించిన విజయాన్ని చూసి పొంగిపోయింది. ఇక మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పవన్ కళ్యాణ్ చిరంజీవి కుటుంబాన్ని కలిశారు. ఈ సందర్బంగా వదిన సురేఖ ఖరీదైన పెన్నును గిఫ్ట్ గా ఇచ్చారు. సురేఖ స్వయంగా ఆ పెన్నును పవన్ కల్యాణ్ జేబులో పెట్టారు. ఈ మోంట్ బ్లాంక్ పెన్ను ధర రూ.90 వేలు-రూ.2.60 లక్షల మధ్య ఉంటుంది. పవన్ కు సురేఖ పెన్ను ఇస్తుండగా తీసిన వీడియోను మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ చేశారు.
కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి! 😍@PawanKalyan pic.twitter.com/vzt6rNX7gt
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 15, 2024
Read Also : KCR : గజ్వేల్ పట్టణం “కేసీఆర్ తప్పిపోయాడు…” అంటూ పోస్టర్లు