Surekhavani Daughter Supritha : ‘నేను మీకేం అన్యాయం’ అంటూ సురేఖవాణి కూతురి ఆవేదన
కొద్దీ రోజుల క్రితం సురేఖ , సుప్రీత లు కారు గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రమోషన్ చేసారు..తీరా నిన్న రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోను
- By Sudheer Published Date - 09:40 PM, Mon - 4 December 23

సురేఖవాణి..ఈ పేరు తెలుగు చిత్రసీమలో బాగా ఫేమస్. వదిన గా , అత్తా గా ఇలా అనేక క్యారెక్టర్ లలో నటిస్తూ మెప్పిస్తుంది వస్తుంది. గత కొద్దీ నెలలుగా తన కూతురు సుప్రీత కలిసి వీడియోస్ , ఫొటోస్ షేర్ చేస్తూ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది. సుప్రీత సైతం హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. ఈ క్రమంలో అమ్మడు నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా ఈమెపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. దానికి కారణం కాంగ్రెస్ , బిఆర్ఎస్ పార్టీలే. అదేంటి అనుకుంటున్నారా..? కొద్దీ రోజుల క్రితం సురేఖ , సుప్రీత లు కారు గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రమోషన్ చేసారు..తీరా నిన్న రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోను తల్లీకూతుళ్లు షేర్ చేస్తూ కాంగ్రెస్ గెలిచినందుకు కంగ్రాట్స్ చెప్పారు. గతంలో బిఆర్ఎస్ గెలవాలని చేసిన వీడియో డిలీట్ చేసి ఈ ఫోటో పెట్టేసరికి చాలామంది వీరిని ట్రోల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సుప్రీత ట్రోల్స్ పై స్పందించింది. ” ఈ పొలిటికల్ సిచ్యుయేషన్ మీద నన్ను చాలామంది ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. నేను బీఆర్ ఎస్ కు సపోర్ట్ చేస్తాను. కానీ రేవంత్ రెడ్డి గారు గెలిచారని శుభాకాంక్షలు తెలిపాను. అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు.. అంతేకాకుండా కావాలని కూడా ట్రోల్ చేస్తున్నారు. నేను మీకేం అన్యాయం చేశాను. నన్నెందుకు ఇలా వేధిస్తున్నారు. మీకు కొంచమైనా తెలుసా.. దీనివలన మా పర్సనల్ అండ్ మెంటల్ హెల్త్ ఎంత బాధపెడుతుందో” అంటూ రాసుకొచ్చింది.
Read Also : Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కన్నా బర్రెలక్క బెటర్ – ఎంపీ నందిగాం సురేష్