Tollywood : డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంట విషాదం..
13 ఏళ్లుగా తన ఫార్మ్ లోనే ఉన్న ఆవు చనిపోయినట్లు ఎమోషనల్ గా ట్వీట్ చేసాడు.
- By Sudheer Published Date - 11:45 AM, Thu - 14 September 23

డైరెక్టర్ శ్రీను వైట్ల (Srinu vaitla) ఇంట విషాదం చోటుచేసుకుంది. విషాదం అనగానే ఎవరైన కుటుంబ సభ్యులు చనిపోయారా..? అని అనుకోవచ్చు..కానీ ఇక్కడ చనిపోయింది మనిషి కాదు మూగ జీవి. తాను మొదటిసారిగా ఇంటికి తెచ్చుకున్న ఆవు (Cow) చనిపోయినట్లు శ్రీను వైట్ల తన ట్విట్టర్ వేదికగా తెలియజేసాడు. 13 ఏళ్లుగా తన ఫార్మ్ లోనే ఉన్న ఆవు చనిపోయినట్లు ఎమోషనల్ గా ట్వీట్ చేసాడు. ‘లక్ష్మీ’ (Lakshmi ) అని శ్రీను వైట్ల కూతుర్లు ప్రేమగా పిలుచుకునే ఆవుకి సాంప్రదాయంగా అంత్యక్రియలు చేయబోతున్నారట. ఈ సందర్బంగా ‘లక్ష్మీ’ ఫోటోని పోస్ట్ చేసి శ్రీను వైట్ల ఈ విషయాన్ని తెలియజేసాడు.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది జంతు ప్రేమికులు ఉంటారు. మూగ జీవులను మనుషుల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి కుటుంబం లో ఓ సభ్యుడిగా మూగ జీవులను భావిస్తారు. అందుకే వాటిని తీసుకొచ్చి ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. అవి చనిపోతే తట్టుకోలేక బాధపడుతుంటారు. ప్రస్తుతం శ్రీనువైట్ల కూడా అలాగే బాధపడుతున్నాడు. ఇక శ్రీను వైట్ల సినిమాల విషయానికి వస్తే..కెరియర్ ప్రారంభంలో వరుస విజయాలతో దూకుడు చూపించారు. ఆ తర్వాత ఆగడు తో ఆగిపోయాడు. మహేష్ బాబు తో దూకుడు , ఆగడు చిత్రాలను డైరెక్ట్ చేసాడు. దూకుడు బాక్స్ ఆఫీస్ వద్ద దూకుడ్ని కనపరిస్తే..ఆగడు మాత్రం భారీ డిజాస్టర్ అయ్యి..శ్రీను వైట్ల కెరియర్నే ఆపేసింది. ఈ మూవీ తర్వాత వైట్ల కు సినిమా ఛాన్సులు ఇచ్చేందుకు ఎవ్వరు పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు. ఆ మధ్య ఒకటి , రెండు సినిమాలు చేసినప్పటికీ అవి కూడా భారీ డిజాస్టర్లు అయ్యాయి.
Read Also : Dengue Deaths: వరంగల్ జిల్లాలో ‘డెంగ్యూ’ కలకలం, 12 మంది మృతి!
రీసెంట్ గా గోపించంద్ (Gopichand) తో ఓ మూవీ ని ప్రారంభించారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెట్స్ పైకి వెళ్ళింది. మరి ఈ సినిమా విజయం అనేది శ్రీను వైట్ల కే కాదు గోపీచంద్ కు కూడా చాల అవసరం. మరి ఇది ఏంచేస్తుందో చూడాలి.
https://x.com/SreenuVaitla/status/1702177859635233185?s=20