Srileela : శ్రీలీల జాక్ పాట్ కొట్టేసిందిగా..!
Srileela మాస్ మహారాజ్ రవితేజ సరసన ఒక సినిమా చేస్తున్న శ్రీ లీల.. లేటెస్ట్ గా అక్కినేని బ్రదర్స్ ఇద్దరు సినిమాల్లో ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది
- By Ramesh Published Date - 11:04 AM, Sun - 15 December 24

యువ కథానాయకుల్లో శ్రీ లీల (Srileela) సంథింగ్ స్పెషల్ అనిపించుకునేందుకు బాగా ప్రయత్నిస్తుంది. పెళ్లి సందడితో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న అమ్మడు.. మధ్యలో కొన్ని వరుస ప్లాపుల వల్ల కెరీర్ రిస్క్ లో పడేసుకుంది. సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమాలో నటించిన అమ్మడు ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.
ఇప్పుడు మళ్లీ శ్రీలీల తిరిగి ఫామ్ లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ మధ్యనే పుష్ప 2 (Pushpa 2) సినిమాలో కిసిక్ సాంగ్ లో ఆ సత్తా చాట్ నమ్ముడు వరుస ఆఫర్లతో తన ఫాన్స్ ని ఖుషి చేస్తుంది. ఇప్పటికే మాస్ మహారాజ్ రవితేజ సరసన ఒక సినిమా చేస్తున్న శ్రీ లీల.. లేటెస్ట్ గా అక్కినేని బ్రదర్స్ ఇద్దరు సినిమాల్లో ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. నాగచైతన్య (Naga Chaitanya) విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు కాంబినేషన్లో వస్తున్న సినిమాలో శ్రీలీలని హీరోయిన్గా దాదాపు ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
ఇద్దరు అక్కినేని హీరోలతో..
ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. దీంతోపాటు అక్కినేని అఖిల్ మురళీకృష్ణ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్గా ఒకే అయినట్టు టాక్. ఒకేసారి ఇద్దరు అక్కినేని హీరోలతో శ్రీలీల బంపర్ ఆఫర్ కొట్టేసింది. అమ్మడు తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు ఈ సినిమాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పొచ్చు. డాన్సుల్లో తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకుంటున్నా శ్రీలీల రాబోతున్న సినిమాల్లో నటిగా కూడా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తుంది.
రవితేజ నాగచైతన్య అఖిల్ వీరితో క్రేజీ సినిమాలు లైన్లో పెట్టిన శ్రీలీల మళ్లీ టాప్ హీరోయిన్ గా క్రేజ్ కొనసాగించాలని చూస్తుంది.
Also Read : Prabhas : స్పిరిట్ లో దేవర విలన్..?