Sreeleela : బాలీవుడ్‌కి వెళ్తున్న శ్రీలీల.. ఆ స్టార్ హీరో వారసుడికి జోడిగా..
ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గిన శ్రీలీలకి బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ ఎదురొచ్చిందట. ఆ స్టార్ హీరో వారసుడికి జోడిగా..
- By News Desk Published Date - 10:38 AM, Sun - 9 June 24

Sreeleela : అందాల భామ శ్రీలీల.. ‘పెళ్ళిసందడి’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, ‘ధమాకా’తో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకొని తెలుగులో వరుస అవకాశాలు అందుకున్నారు. రవితేజ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలయ్య.. ఇలా స్టార్ హీరోల సినిమాల్లో నటించి టాలీవుడ్ లో తెగ సందడి చేసింది. అయితే వీటిలో చాలా సినిమాలో పెద్దగా హిట్ కాకపోవడంతో.. తెలుగులో అమ్మడుకు అవకాశాలు తగ్గాయి.
దీంతో శ్రీలీల చూపు ఇతర పరిశ్రమల వైపు మళ్లింది. తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చేందుకు శ్రీలీల ప్రయత్నిస్తుంది. అయితే ఈ సమయంలో శ్రీలీలకి ఒక బంపర్ ఆఫర్ ఎదురొచ్చినట్లు చెబుతున్నారు. బాలీవుడ్ నుంచి శ్రీలీలకి ఒక అవకాశం వచ్చిందట. అది కూడా ఒక స్టార్ హీరో వారసుడి లాంచ్ మూవీలో అని సమాచారం. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ ఇప్పటికే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తూ వస్తున్నారు.
ఇక ఇప్పుడు వారసుడి సమయం వచ్చింది. కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఆల్రెడీ కథ, దర్శకుడు కూడా సిద్దమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుందట. ఇక ఈ సినిమాలో ఇబ్రహీంకి జోడిగా శ్రీలీల అయితే బాగుంటుందని మేకర్స్ భావించినట్లు సమాచారం. మరి శ్రీలీల నిజంగా ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చిందా..? లేదా..? తెలియాలంటే.. మూవీ అఫీషియల్ లాంచ్ వరకు ఎదురు చూడాల్సిందే.
కాగా శ్రీలీల టాలీవుడ్ లో నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంకా షూటింగ్ పెండింగ్ ఉంది. పవన్ పొలిటికల్ షెడ్యూల్స్ వల్ల.. ఈ మూవీని పక్కన పెట్టిన మేకర్స్ త్వరలోనే పట్టాలు ఎక్కించనున్నారు. గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత పవన్ అండ్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. ఆడియన్స్ లో ఈ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి.