Siva Karthikeyan Ayalaan Release Break : అయలాన్ రిలీజ్ బ్రేక్.. శివకార్తికేయన్ సినిమాకు షాక్..!
Siva Karthikeyan Ayalaan Release Break శివ కార్తికేయన్ హీరోగా రవికుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా అయలాన్. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా తమిళంలో రిలీజ్ చేయగా వారం తర్వాత జనవరి 26న
- By Ramesh Published Date - 01:11 PM, Fri - 26 January 24

Siva Karthikeyan Ayalaan Release Break శివ కార్తికేయన్ హీరోగా రవికుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా అయలాన్. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా తమిళంలో రిలీజ్ చేయగా వారం తర్వాత జనవరి 26న తెలుగులో రిలీజ్ ప్లాన్ చేశారు. శివ కార్తికేయన్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
We’re now on WhatsApp : Click to Join
అతను చేస్తున్న ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. జాతిరత్నాలు (Jathiratnalu) అనుదీప్ తో ప్రిన్స్ సినిమా తీసి మెప్పించిన శివ కార్తికేయన్ (Siva Karthikeyan) ఆ తర్వాత మహావీరుడు సినిమాతో కూడా మెప్పించాడు.
అయలాన్ సినిమా కోలీవుడ్ లో మంచి టాక్ తో రన్ అవుతుంది. అక్కడ సినిమా 50 కోట్ల పైన వసూళ్లను రాబట్టింది. తెలుగులో కూడా అయలాన్ (Ayalaan) హిట్ అవుతుందని శివ కార్తికేయన్ అనుకున్నారు. సినిమాను ఇక్కడ రిలీజ్ సందర్భంగా ప్రమోట్ చేశారు. సినిమాలో ఏలియన్ ఉండటం పిల్లాలు పెద్దలని అందరినీ అలరిస్తుందని చెప్పారు.
అయితే శుక్రవారం తెలుగులో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాకు బ్రేక్ పడినట్టు తెలుస్తుంది. తెలుగు రిలీజ్ సందర్భంగా తమకు రావాల్సిన ఆర్ధిక లావాదేవీలు తేలే వరకు రిలీజ్ అయ్యేది లేదని అయలాన్ సినిమాను ఆపేశారట. సినిమా మార్నింగ్ షోకి టికెట్స్ ఇచ్చిన థియేటర్ యాజమాన్యం షో క్యాన్సిల్ అని తెలియడంతో టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చారట.
శివ కార్తికేయన్ సినిమా రిలీజ్ బ్రేక్ పడటం ఆ హీరో తెలుగు ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేసింది. ఈరోజు అయలాన్ తో పాటుగా ధనుష్ కెప్టెన్ మిల్లర్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.