Siddhu Jonnalagadda : డీజే టిల్లు నెక్స్ట్ సినిమా.. వెరైటీ టైటిల్‌తో.. లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో..
టాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా మారుతూ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా, KGF భామ శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా హీరోయిన్స్ గా సినిమాని ప్రకటించారు.
- By News Desk Published Date - 09:12 PM, Mon - 16 October 23

డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda). ఆ సినిమా తర్వాత వరుసగా కొన్ని సినిమాలు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత రాబోయే సినిమాని అనౌన్స్ చేసాడు సిద్ధూ జొన్నలగడ్డ.
టాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా మారుతూ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా, KGF భామ శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా హీరోయిన్స్ గా సినిమాని ప్రకటించారు. ఈ సినిమాకు ‘తెలుసు కదా’ అనే వెరైటీ టైటిల్ ని ప్రకటించారు. ఇక ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఆ నిర్మాణ సంస్థలో ఇది 30వ సినిమా అవడం విశేషం.
తాజాగా టైటిల్ అనౌన్సమెంట్ వీడియో రిలీజ్ చేయగా ఇది చూసి క్లాసిక్ లవ్ స్టోరీలా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాతో సిద్ధూ ఎలా మెప్పిస్తాడో చూడాలి.