Shruti Haasan in Hollywood: శ్రుతి హాసన్‌కి హాలీవుడ్ ఆఫర్.. గ్రీస్ లో బిజీ బిజీ!
శ్రుతి హాసన్‌కి ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం వచ్చింది. ఈ వార్తను ఆమె తన ట్విట్టర్ లో
- By Balu J Published Date - 11:11 PM, Sat - 22 October 22
శ్రుతి హాసన్‌కి ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం వచ్చింది. ఈ వార్తను ఆమె తన ట్విట్టర్ లో రివీల్ చేశారు. హాలీవుడ్ మూవీ ‘ది ఐ’లో శ్రుతి నటించనుంది. ఈ సినిమాలో ‘ది లాస్ట్ కింగ్డమ్’ ఫేమ్ మార్క్ రౌలీ కీలక పాత్ర పోషిస్తున్నారు. డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్‌గా అలరించబోతోంది. ఈ నేపథ్యంలో శృతి హాసన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది.
‘‘నేనెందుకు గ్రీస్‌లో ఉన్నానో తెలుసా.. ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాను.. ఈ శుభవార్తను మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది’’ అని శృతి హాసన్ అన్నారు. ఒక ద్వీపంలో మరణించిన తన భర్త అవశేషాలను సేకరించడానికి ఒక ద్వీపానికి వెళ్లిన వితంతువు గురించి సినిమా కథ కనిపిస్తుంది. అన్నా సవ్వా, లిండా మార్లో, క్రిస్టోస్ స్టెర్గియోగ్లో తదితరులు ‘ది ఐ’లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇక శృతి హాసన్ కెరీర్ విషయానికి వస్తే ప్రభాస్ సరసన ‘సాలార్’ సినిమాలో నటిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల కానుంది. కేజీఎఫ్ నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడంతో ‘సాలార్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తెలుగులో ‘వీరసింహారెడ్డి’, ‘మెగా 154’ సినిమాలు చేస్తోంది.
Psychological Thriller ‘The Eye’ Starring Shruti Haasan & Mark Rowley Starts Production https://t.co/T4ycKaAuch
— Deadline Hollywood (@DEADLINE) October 20, 2022
Related News
Shruthi Hassan : డైరెక్టర్ తో రొమాన్స్ కోసం హీరోయిన్ బలవంతం..!
Shruthi Hassan కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లేటెస్ట్ గా ఆర్టిస్ట్ అవతారం ఎత్తాడు. కమల్ హాసన్ నిర్మాణంలో శృతి హాసన్ కాన్సెప్ట్ అండ్ కంపోజింగ్ లో వస్తున్న స్పెషల్ వీడియో ఇనిమేల్.