Shruti Haasan : నాకు తాగుడు అలవాటు ఉండేది.. అందులో ఎలాంటి ఆనందం లేదని.. శృతిహాసన్ వ్యాఖ్యలు..
ఇటీవల శృతి ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆల్కహాల్, డ్రగ్స్ పై శృతి మాట్లాడింది.
- Author : News Desk
Date : 18-12-2023 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
కమల్ కూతురిగా శృతిహాసన్(Shruti Haasan) సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలు చేస్తుంది. ఈ సంవత్సరం మొదట్లో బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలతో వచ్చి హిట్ కొట్టింది శృతి హాసన్. ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమాతో రాబోతుంది. ఇటీవలే అడివి శేష్(Adivi Sesh) తో కూడా ఓ సినిమాని ప్రకటించింది శృతి .
మరో పక్క సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా సొంత ఆల్బమ్స్ పాడుతూ బిజీగా ఉంది. మరో పక్క బాయ్ ఫ్రెండ్ తో తిరిగేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది శృతి హాసన్. ఇటీవల శృతి ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆల్కహాల్, డ్రగ్స్ పై శృతి మాట్లాడింది.
శృతి హాసన్ మాట్లాడుతూ.. గతంలో నాకు డ్రింకింగ్ అలవాటు ఉంది. కానీ తర్వాత మందు తాగడంలో ఎలాంటి ఆనందం లేదని అర్థమయి మానేశాను. నేను డ్రింకింగ్ మానేసి 8 ఏళ్ళు అయింది. డ్రింకింగ్ మానేసినప్పుడు మొదట్లో కొంచెం కష్టంగానే ఉండేది. కానీ ఇప్పుడు జీవితం ప్రశాంతంగా ఉంది. ముందుకి దూరంగా ఉన్నాక హ్యాపీగా ఉన్నాను, ఎలాంటి హ్యాంగోవర్స్ లేవు. మళ్ళీ జీవితంలో ఇంకెప్పుడు మందు తాగకూడదని కూడా డిసైడ్ అయ్యాను. ఇక డ్రగ్స్ జోలికి అస్సలు పోలేదు అని చెప్పింది. దీంతో శృతి హాసన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Operation Valentine : పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ నుంచి రాబోయే సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ టీజర్ రిలీజ్..