Shruti Haasan: చిరుతో ‘శ్రుతి’ కుదిరింది!
మెగాస్టార్ చిరంజీవి 'మెగా154' నిర్మాతలు నటి శ్రుతి హాసన్‌ను సెట్స్ లోకి వెల్ కం చెప్పేశారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
- Author : Balu J
Date : 09-03-2022 - 12:24 IST
Published By : Hashtagu Telugu Desk
మెగాస్టార్ చిరంజీవి ‘మెగా154’ నిర్మాతలు నటి శ్రుతి హాసన్‌ను సెట్స్ లోకి వెల్ కం చెప్పేశారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ మెగాస్టార్ కూడా బొకే ఇచ్చి స్వాగతం పలికారు. “ఈ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తిని స్వాగతించినందుకును సంతోషిస్తున్నాను” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. శ్రుతి, చిరంజీవి ఇద్దరూ కలిసి మొదటిసారిగా నటిస్తున్నారు. ‘మాస్ యాక్షన్ డ్రామా’గా రూపొందనున్న ‘మెగా154’ దర్శకుడు బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎడిటర్‌గా నిరంజన్ దేవరమానె, ప్రొడక్షన్ డిజైనర్‌గా ఎఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల. బాబీ స్వయంగా ఈ సినిమాకు కథ, మాటలు అందిస్తున్నారు.
On this Women's Day, delighted to Welcome you on board @shrutihaasan
You bring Woman Power to #Mega154 @MythriOfficial @dirbobby #GKMohan @ThisIsDSP pic.twitter.com/xYMaiQPpni— Chiranjeevi Konidela (@KChiruTweets) March 8, 2022