Shraddha Kapoor: ఫ్లూని కొట్టడానికి నేను కడా తాగుతాను. మీరందరూ త్వరగా నా సినిమా చూడడానికి వెళ్లండి
ప్రముఖ నటి శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్ లో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. తనను ఫాలో అయ్యే 7.9 కోట్ల మంది ఫాలోయర్స్ కోసం ఆమె ఎల్లప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ
- By Maheswara Rao Nadella Published Date - 06:30 PM, Tue - 14 March 23

ప్రముఖ నటి శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) ఇన్‌స్టాగ్రామ్ లో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. తనను ఫాలో అయ్యే 7.9 కోట్ల మంది ఫాలోయర్స్ కోసం ఆమె ఎల్లప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉంటుంది. తాను తినే వెరైటీ ఫుడ్స్ దగ్గరి నుంచి విజిట్ చేసే కొత్త ప్లేస్ ల వరకు అన్నీ ఫోటోస్ తో సహా శ్రద్ధా షేర్ చేస్తుంటుంది. ఇటీవల ఆమె ఫ్లూతో బాధపడినప్పుడు.. దానిని ఎలా ఎదుర్కొందనే విషయాన్ని తాజాగా ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో వెల్లడించింది. ఇంట్లో తయారుచేసిన కడా తాగి ఫ్లూను అధిగమించానని తెలిపింది. బెడ్ పై కులాసాగా కూర్చొని కడా తాగుతున్న ఒక ఫోటోను ఆమె తన పోస్ట్ లో యాడ్ చేసింది. సుగంధ ద్రవ్యాలు, మూలికలతో ఇంట్లోనే తయారుచేసిన ఔషధ మిశ్రమం కడా అని ఆమె పేర్కొంది. సాధారణ జలుబు, దగ్గు, ఫ్లూని అధిగమించడానికి ఇది బాగా పనిచేస్తుందని తెలిపింది. “మై కడా పీకే ఫ్లూ కో భగాతీ హు. ఆప్ లోగ్ భాగ్ కే మేరీ సినిమా దేఖ్నే జావో (ఫ్లూని కొట్టడానికి నేను కడా తాగుతాను. మీరందరూ త్వరగా నా సినిమా చూడడానికి వెళ్లండి)” అని శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసింది.ఆమె నటించిన ‘తు ఝూటి.. మై మక్కార్’ మూవీ మార్చి 8న రిలీజ్ అయింది.
స్ట్రీట్ ఫుడ్ చాలా ఇష్టం..
శ్రద్ధా కపూర్ కు స్ట్రీట్ ఫుడ్ అన్నా చాలా ఇష్టం . స్ట్రీట్ ఫుడ్ తింటూ ఆమె ఎన్నో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు పోస్ట్ చేసింది. ఈ లిస్టులో టిక్కీ, పానీ పూరి, దబేలీ వంటివన్నీ ఉన్నాయి.. లేటెస్ట్ గా ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి పానీ పూరీ, రగ్దా పట్టీల టేస్ట్ ను ఆస్వాదించింది. ఆ తర్వాత చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో.. “ఫుడీస్ యునైటెడ్. పద్మిని కొల్హాపురే యొక్క పానీ పూరీ ప్యార్, తేజు కొల్హాపురే యొక్క రగ్దా పట్టీస్ ప్యార్” అని రాశారు. దక్షిణ భారత వంటకాలు, బేకరీ ఫుడ్, థాలీస్ సహా మరిన్నింటిని ఆమె తిన్న వీడియోలు ఇన్‌స్టాగ్రామ్ లో సందడి చేస్తుంటాయి.
సినిమాల్లో బిజీగా ఉన్నా..
మరోవైపు శ్రద్ధా కపూర్ సినిమాల్లోనూ బిజీగా ఉంది. అయినా ఇన్‌స్టాగ్రామ్ లో తన అభిమానులను మాత్రం ఆమె నిత్యం పలకరిస్తూనే ఉంటుంది.
ఆమె రణబీర్ కపూర్‌తో కలిసి ఒక మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. శ్రద్ధా కపూర్ , రాజ్‌కుమార్ రావ్ జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం ‘స్త్రీ’ రూ. 125కోట్ల వసూళ్లను రాబట్టి మంచి విజయం సాధించింది.
తాజాగా ఈ ఫ్రాంచైజీలో ‘స్త్రీ 2’ (Stree 2) చిత్రాన్ని అమర్ కౌశిక్, దినేష్ విజన్ జూలైలో ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనిలోనూ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.
Also Read: Unlimited Food: రూ.60కి తిన్నంత ఆహారం. వేస్ట్ చేసారో జరిమానా తప్పదు!

Related News

Supreme Court Orders: కరోనా టైమ్ లో విడుదలైన ఖైదీలు మళ్లీ జైలుకు రావాలి.. సుప్రీంకోర్టు
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సంగతి అందరికి తెలిసిందే. కరోనా తీవ్రంగా ఉన్ననాటి రోజులు గుర్తుకు వస్తే ఇప్పటికీ భయమే . కఠినమైన లాక్ డౌన్లు..