Guntur Karam: ఆది నుంచి అడ్డంకులే.. గుంటూరు కారం మూవీకి ఏమైంది!
మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
- By Balu J Published Date - 05:26 PM, Mon - 24 July 23

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం మూవీ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఏ ముహుర్తానా మొదలైందో కానీ.. అప్పట్నుంచే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎన్నో కారణాలు ముందుకు సాగుతూ ఆగిపోతూ ఉంది. మహేష్‌కు జోడీగా మొదట పూజా హెగ్దేను తీసుకుని తరువాత మార్చేశారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్‌ను కూడా తీసేసినట్టే అని టాక్ నడుస్తోంది. తాజాగా గుంటూరు కారం సినిమాకు కెమెరామెన్‌గా పీఎస్ వినోద్‌ను తీసుకున్నారు. త్రివిక్రమ్ చాలా సినిమాలకు పీఎస్ వినోద్ కెమెరామేన్‌గా చేశాడు. వీరిద్దరి మధ్య మంచి ర్యాపో ఉంది.
ఈ సినిమా కోసం వినోద్ ఇచ్చిన డేట్స్ వచ్చే నెలతో పూర్తి కాబోతున్నాయి. కానీ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా సగం కూడా కాలేదు. దీంతో వినోద్‌ను రవి కె చంద్రన్‌తో రీప్లేస్ చేయబోతున్నాడట. ఈ సినిమాకు వస్తున్న వరుస అడ్డంకులతో మహేష్ ఫ్యాన్స్ డీలా పడిపోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆగిపోయిందంటూ చాలా సార్లు పుకార్లు కూడా వచ్చాయి. దర్శక నిర్మాతల క్లారిటీతో ఆ పుకార్లకు చెక్ పడింది. కానీ ప్రాజెక్ట్ నుంచి ఒక్కొక్కరుగా ఇలా బయటికి వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఫస్ట్ లుక్స్, టైటిల్ పోస్టర్ తో మంచి బజ్ క్రియేట్ చేసినప్పటికీ, అనేక కారణాలతో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇక మహేశ్ కూడా వరుస విదేశీ టూర్లకు వెళ్తుండటం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా మరోవైపు ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మహేశ్ సినిమా కోసం ఇప్పట్నుంచే కసరత్తులు చేస్తుండటం గమనార్హం.
Also Read: KTR’s Son: మరో టాలెంట్ కు సిద్ధమవుతున్న కేటీఆర్ కుమారుడు హిమాన్షు