Shobhita’s first post after Marriage : పెళ్లి తర్వాత శోభిత పెట్టిన తొలి పోస్ట్
Sobhita Dhulipala : తన పెళ్లి ఫొటోను పోస్ట్ చేస్తూ "పెళ్లి ఫొటో" అని క్యాప్షన్ ఇచ్చారు. శోభిత పెళ్లి సమయంలో చైతన్యతో కలిసి దిగిన ఒక అందమైన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు
- By Sudheer Published Date - 03:42 PM, Thu - 5 December 24

హీరోయిన్ శోభిత ధూళిపాలా, అక్కినేని హీరో నాగచైతన్యతో వివాహం తర్వాత తన మొదటి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను షేర్ చేశారు. తన పెళ్లి ఫొటోను పోస్ట్ చేస్తూ “పెళ్లి ఫొటో” అని క్యాప్షన్ ఇచ్చారు. శోభిత పెళ్లి సమయంలో చైతన్యతో కలిసి దిగిన ఒక అందమైన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. గత కొద్దీ రోజులుగా ప్రేమలో మునిగిపోయిన వీరు..నిన్న (డిసెంబర్ 04) హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ ANR విగ్రహం ముందు ఒక్కటయ్యారు. స్టూడియో లో ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం (Naga Chaitanya – Sobhita Wedding) అట్టహాసంగా జరిగింది.
నాగచైతన్య మరియు శోభిత ధుళిపాళ్లల వివాహం అత్యంత వైభవంగా మరియు సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ప్రత్యేకంగా దేవాలయానికి తక్కువ కాని విశిష్టమైన థీమ్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భం ఆక్కినేని నాగేశ్వర్ రావు గారి శతజయంతిని పురస్కరించుకుని ఆవిష్కరించిన విగ్రహం తర్వాత జరిగే మొదటి ముఖ్యమైన వేడుక కావడం విశేషం. సాయంత్రం 8:13 గంటల శుభముహూర్తంలో ప్రారంభమైన ఈ వివాహం తెలుగువారి సంప్రదాయాల తీరుతెన్నులన్నింటినీ ప్రతిబింబిస్తూ జరిగింది. పెద్దల పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలో కుటుంబసభ్యులు, స్నేహితులు ఆహ్లాదంగా పాల్గొని నవదంపతులకు ఆశీర్వచనాలు అందించారు.
Read Also : Astronauts Rescue: ఐడియా ఇచ్చుకో.. రూ.16 లక్షలు పుచ్చుకో.. నాసా సంచలన ఆఫర్