Video Viral : : అమ్మతో కలిసి శేఖర్ మాస్టర్ డాన్స్.. వీడియో వైరల్
Video Viral : శేఖర్ మాస్టర్.. టాలీవుడ్ స్టార్ కొరియోగ్రఫర్ !!
- Author : Pasha
Date : 11-02-2024 - 1:03 IST
Published By : Hashtagu Telugu Desk
Video Viral : శేఖర్ మాస్టర్.. టాలీవుడ్ స్టార్ కొరియోగ్రఫర్ !! ఈయన వెండితెరపై స్టార్ హీరోలకు డ్యాన్స్ కోరియోగ్రఫీ చేస్తుంటారు. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ నిర్వహిస్తున్న డ్యాన్స్ షోలో ఆయన జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షో వేదికగా ఎంతోమంది యువ డ్యాన్సర్ల ట్యాలెంట్‌ను గుర్తించి, ప్రశంసించే పనిని శేఖర్ మాస్టర్ చేస్తున్నారు.వెండితెరపై కెమెరా వెనుక ఉండే శేఖర్ మాస్టర్.. బుల్లితెర షోలతో కెమెరా ముందు అలరిస్తూ తెలుగు ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join
ఇప్పటికే శేఖర్ మాస్టర్ భార్య, పిల్లలు ఈ షో ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. తాజాగా శేఖర్ మాస్టర్ తన తల్లిని అందరికీ పరిచయం చేశారు. శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరించే డాన్స్ షో ‘ఢీ’కి.. శేఖర్ అమ్మ గెస్ట్ గా వచ్చారు. వాలెంటైన్ డే స్పెషల్ షోకి అతిథిగా వచ్చిన శేఖర్ అమ్మ కొడుకుతో కలిసి డాన్స్ వేశారు. చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి గొప్ప డ్యాన్సర్స్ కి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్.. తన తల్లితో కలిసి ఢీ స్టేజిపై డ్యాన్స్ వేసి ఎంతో ఆనంద పడ్డారు. ఇదే ఎపిసోడ్ లో వాలెంటైన్ డే సందర్భంగా తన వైఫ్ సుజాతకి కాల్ చేసి ‘ఐ లవ్ యూ’ చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్(Video Viral) అవుతోంది.
Also Read : Water War : బీఆర్ఎస్‌తో ‘వాటర్ వార్’.. కాంగ్రెస్ ప్రత్యేక వర్క్‌షాప్
శేఖర్ మాస్టర్ వారసులు సాహితి, విన్నీ.. తండ్రి లాగానే డ్యాన్స్ తో ఆడియన్స్ ని మెప్పించి ఇప్పుడే అభిమానులను సంపాదించుకున్నారు. కొడుకు విన్నీ అయితే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అతడు నటిస్తున్నాడు. శేఖర్ మాస్టర్ కుటుంబంలోని ఈ ముగ్గురు అందరికి పరిచయమే. కానీ శేఖర్ మాస్టర్ లాంటి గొప్ప డాన్సర్ ని ఇండస్ట్రీకి ఇచ్చిన అమ్మ ఎవరు అన్నది మాత్రం ఎవరికి తెలియదు.