Sharwanand- Anupama : మరోసారి జోడి కట్టబోతున్న శర్వానంద్ – అనుపమ
Sharwanand- Anupama : ప్రస్తుతం శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి మరియు కొత్త దర్శకుడు అభిలాష్ దర్శకత్వంలో ఓ సినిమాతో బిజీగా ఉన్నాడు
- By Sudheer Published Date - 04:45 PM, Sun - 16 March 25

టాలీవుడ్‌లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న జంట శర్వానంద్ – అనుపమ పరమేశ్వరన్ (Sharwanand- Anupama). వీరిద్దరూ కలిసి నటించిన శతమానం భవతి (Shathamanam Bhavathi) చిత్రం మంచి విజయాన్ని సాధించి, ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచింది. ఇప్పుడు ఈ జంట మరోసారి స్క్రీన్‌పై కనిపించేందుకు సిద్ధం అవుతున్నారు. శర్వానంద్ కథానాయకుడిగా సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపొందనుంది. ఈ సినిమా కోసం అనుపమను కథానాయికగా ఎంపిక చేశారు. ఇటీవల చిత్రబృందం ఆమెను సంప్రదించగా, ఆమె సానుకూలంగా స్పందించి ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ నుండి షూటింగ్ ప్రారంభించనుంది.
Black Magic Vs 1500 Crores: పుర్రెలు.. లీలావతి ఆస్పత్రి.. రూ.1500 కోట్ల స్కామ్
అనుపమ ఇటీవల రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర చిన్నదైనా, యూత్‌ను ఆకట్టుకోవడంలో విజయవంతమైంది. దీనితో టాలీవుడ్‌లో మళ్లీ అనుపమపై ప్రత్యేక దృష్టి పడింది. ప్రస్తుతం శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి మరియు కొత్త దర్శకుడు అభిలాష్ దర్శకత్వంలో ఓ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు సమాంతరంగా జరుగుతున్నాయి. నారీ నారీ.. షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు చేరుకోవడంతో, ఆయన సంపత్ నంది ప్రాజెక్ట్‌కు అంగీకారం తెలిపారు.
దర్శకుడు సంపత్ నంది ఇటీవలే ఓదెల 2 చిత్రాన్ని నిర్మించారు, ఇందులో తమన్నా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది. తన నిర్మాత బాధ్యతలను పూర్తిచేసుకున్న తర్వాత, శర్వానంద్‌తో సినిమా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. శర్వానంద్, అనుపమ కాంబినేషన్ మళ్లీ స్క్రీన్‌పై మాయచేయనుందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి!