Jr NTR: ఎన్టీఆర్ ‘హనుమాన్ దీక్ష’ రహస్యమిదే!
గత నాలుగు రోజులుగా ఎన్టీఆర్ హనుమాన్ దీక్షలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
- By Balu J Published Date - 05:08 PM, Wed - 20 April 22
గత నాలుగు రోజులుగా ఎన్టీఆర్ హనుమాన్ దీక్షలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే హీరో రాంచరణ్ అయ్యప్ప మాల ధరించి, ఆధ్యాత్మిక సేవలో తరిస్తున్నాడు. అయితే చరణ్ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా అయ్యప్ప మాల వేస్తుంటారు. అసలు విషయ ఏమిటంటే.. జూనియర్ హనుమాన్ మాల ధరించడం అటు టాలీవుడ్ లో, ఇటు అభిమానుల్లోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఎన్టీఆర్ అకస్మాత్తుగా హనుమాన్ దీక్ష ఎందుకు చేపట్టారు? దానికి గల కారణాలేంటి? అనేవి చర్చనీయాంశంగా మారాయి.
చరణ్ మాల ధరించడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేనప్పటికీ, జూనియర్ కు బలమైన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. సినిమాలు, ఫ్యామిలీ తో మధ్య గడిపే జూనియర్ హన్ మాన్ దీక్ష ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే… ఎన్టీఆర్ తన జాతకంలో ఉన్న దోషాల కారణంగానే హనుమాన్ దీక్ష చేపట్టారని.. దీంట్లో కుటుంబ సభ్యుల ఒత్తిడి కూడా కొంత మేర ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ దీక్ష ముగిసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా మొదలుపెట్టే అవకాశం ఉంది.
Related News
Kondagattu : ఉచిత బస్సు కింద పడి భక్తుడికి గాయాలు
భక్తుల కోసం దిగువ కొండగట్టు నుండి గుట్ట పైకి దేవస్థానం అధికారులు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించారు