Satyadev : RRR సినిమాలో సత్యదేవ్.. ఎడిటింగ్ లో తీసేసిన రాజమౌళి..
తాజాగా జీబ్రా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సత్యదేవ్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..
- By News Desk Published Date - 09:52 AM, Tue - 12 November 24

Satyadev : రాజమౌళి RRR సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. హాలీవుడ్ లో, వేరే దేశాల్లో కూడా అదరగొట్టి ఏకంగా ఆస్కార్ తో పాటు అనేక ఇంటర్నేషనల్ అవార్డులు సాధించింది ఈ సినిమా. అయితే RRR సినిమాలో సత్యదేవ్ నటించాడట.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన సత్యదేవ్ ఆ తర్వాత హీరోగా, విలన్ గా బిజీ అయ్యాడు. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. త్వరలో జీబ్రా అనే సినిమాతో రాబోతున్నాడు సత్యదేవ్. ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అన్ని పరిశ్రమల నుంచి స్టార్స్ నటిస్తున్నారు.
తాజాగా జీబ్రా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సత్యదేవ్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. RRR సినిమాలో నేను కూడా నటించాను. ఆ సినిమాకు చాలా రోజులే పనిచేసాను. కానీ ఆ ఎపిసోడ్ మొత్తం రాజమౌళి గారు ఎడిటింగ్ లో తీసేసారు. ఆల్మోస్ట్ 16 నిముషాలు ఉంటాను సినిమాలో. కానీ ఆ టీమ్ మీదున్న రెస్పెక్ట్ తో ఈ విషయం ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు అని తెలిపారు. దీంతో సత్యదేవ్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
సత్యదేవ్ చాలా మంచి నటుడని అందరికి తెలిసిందే. ఏకంగా చిరంజీవే తన నటన మెచ్చి తన సినిమాలో విలన్ రోల్ ఇచ్చాడు. అలాంటి సత్యదేవ్ RRR సినిమాలో నటించాడని, కానీ సీన్స్ తీసేశారని చెప్పడంతో అవి ఏం సీన్స్ అని ఫ్యాన్స్, నెటిజన్లు అడుగుతున్నారు. కనీసం డిలీటెడ్ సీన్స్ అని సత్యదేవ్ నటించిన సన్నివేశాలను యూట్యూబ్ లో విడుదల చెయ్యమని కోరుతున్నారు. మరి RRR సినిమాలో సత్యదేవ్ ఏ పాత్ర చేసాడో, రాజమౌళి అతన్ని ఎలా చూపించాడో వాళ్ళకే తెలియాలి.
Also Read : Gopi Mohan : డైరెక్టర్ గా మారుతున్న స్టార్ రైటర్.. మహేష్ మేనల్లుడు హీరోగా సినిమా..