News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Satya Dev On Board For A Vital And Full Length Role In Megastar Chiranjeevi Godfather

Satya Dev: అన్నయ్యా.. నువ్వే మా ‘ఆచార్య’

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 153వ చిత్రం 'గాడ్ ఫాదర్' మోహన్ రాజా దర్శకత్వంలో ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది.

  • By Balu J Published Date - 12:24 PM, Fri - 29 April 22
Satya Dev: అన్నయ్యా.. నువ్వే మా ‘ఆచార్య’

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 153వ చిత్రం ‘గాడ్ ఫాదర్’ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది. ఈ చిత్రానికి చాలా ప్రత్యేక ఆకర్షణలు వున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, స్టార్ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా గాడ్‌ఫాదర్‌లో నటుడు సత్యదేవ్ కీలకమైన, పూర్తిస్థాయి పాత్రలో నటిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు.’ఆచార్య’ సినిమాలో తన ఎంతగానో ఆరాధించే మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ స్పేస్ పంచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ..“అన్నయ్యా, నటనలో జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈరోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది” అని ట్వీట్ చేశారు సత్యదేవ్. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో దిగిన ఓ ఫోటో గ్రాఫ్ ని అభిమానులతో పంచుకున్నారు.

దీనికి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ,..“డియర్ సత్యదేవ్ ..థ్యాంక్ యూ. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం.. #ఆచార్య లో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం..#గాడ్ ఫాదర్ సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం..So proud of you. God bless! ” అని రీట్వీట్ చేశారు మెగాస్టార్. టాప్ టెక్నికల్‌ టీమ్‌ గాడ్ ఫాదర్ కోసం పని చేస్తున్నారు. వెటరన్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండగా, సంగీత సంచలనం ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. అనేక బాలీవుడ్ హిట్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సురేష్ సెల్వరాజన్ ఈ చిత్రానికి ఆర్ట్‌వర్క్‌ అందిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.

అన్నయ్యా,
నటనలో జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు.
అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే.
మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈరోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది.మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది. @KChiruTweets pic.twitter.com/2Ot8A2CP03

— Satya Dev (@ActorSatyaDev) April 28, 2022

Tags  

  • chiranjeevi
  • Godfather
  • latest tollywood news
  • satya dev

Related News

Kushi: ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా ‘విజయ్, సమంత’ల  ఖుషి!

Kushi: ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా ‘విజయ్, సమంత’ల ఖుషి!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమాలో నటిస్తున్నారు.

  • Naga Chaitanya: ‘థాంక్యూ’ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌!

    Naga Chaitanya: ‘థాంక్యూ’ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌!

  • Sunil Exclusive: నాన్ స్టాప్ నవ్వుల కోసం మళ్ళీ మళ్ళీ థియేటర్ కి వెళ్ళడం గ్యారెంటీ!

    Sunil Exclusive: నాన్ స్టాప్ నవ్వుల కోసం మళ్ళీ మళ్ళీ థియేటర్ కి వెళ్ళడం గ్యారెంటీ!

  • Anasuya: ‘వాంటెడ్ పండుగాడ్’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

    Anasuya: ‘వాంటెడ్ పండుగాడ్’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

  • Sonal Chauhan Interview: ఎఫ్ 3లో నాది చాలా సర్ప్రైజింగ్ రోల్!

    Sonal Chauhan Interview: ఎఫ్ 3లో నాది చాలా సర్ప్రైజింగ్ రోల్!

Latest News

  • AP Teachers : స‌మ్మె దిశ‌గా ఏపీ టీచ‌ర్లు

  • SA vs Ind: భారత్‌తో సీరీస్ కు సఫారీ టీమ్ ఇదే

  • Virus In SmartPhone: మీ స్మార్ట్ ఫోన్‌కు వైరస్ సోకకుండా ఇలా జాగ్రత్త పడండి…లేకపోతే హ్యాకర్ల చేతిలో మీ పని గోవిందా…?

  • P Chidambaram : సీబీఐ త‌నిఖీల‌పై చిదంబ‌రం సంచ‌ల‌న ట్వీట్‌

  • AP CM Jagan : ప‌వ‌న్ దెబ్బ‌కు దిగొచ్చిన జ‌గ‌న్

Trending

    • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

    • Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

    • Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

    • Menstual Leave: ఇకపై ఆ దేశంలో మహిళలకు నెలకు మూడు రోజుల పీరియడ్ లీవ్…

    • Bajrang Dal Weapons: కర్నాటకలో మరో వివాదం…ఎయిర్ గన్స్ తో బజరంగ్ దళ్ కార్యకర్తలకు ట్రైనింగ్..!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: